»   » ‘లగాన్’ దర్శకుడితో రామ్ చరణ్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ

‘లగాన్’ దర్శకుడితో రామ్ చరణ్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అక్కడ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు ఉండటం, ప్రేక్షకులు ఊహించిన విధంగా సినిమా లేక పోవడంతో చరణ్ కెరీర్లో పెద్ద ప్లాపు చిత్రంగా నిలిచి పోయింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరో బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ ఇంతకు ముందు లగాన్, స్వదేశ్ లాంటి భారీ హిట్ చిత్రాలు నిర్మించిన అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడు.

http://photos.filmibeat.com/celebs/ram-charan-teja-17461.html

మగధీర, బాహుబలి తరహాలో పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2014 అక్టోబర్ లేదా నవంబర్లో మొదలయ్యే అవకాశం ఉందని రామ్ చరణ్ వెల్లడించారు. మరో వైపు ఈచిత్రంపై అప్పుడే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో రామ్ చరన్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే...రామ్ చరణ్ నటించిన తెలుగు చిత్రం 'ఎవడు' గా జనవరి 12న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయించారు. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.

English summary
Ram Charan reveals his next Bollywood film details. In September this year, we had reported that he was approached by Ashutosh Gowarikar, the director of Lagaan and Swades, for a mega budget period drama. Now, Ram Charan has revealed that this film might go on floors in either October or November in 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu