For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లొకేషన్ లో చెలరేగిపోయిన రామ్ చరణ్ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'ఎవడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఆన్ లొకేషన్ స్టిల్స్ మీడియాకు విడుదల చేసారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఆన్ లొకేషన్ లో రామ్ చరణ్ స్టిల్స్ చూస్తూంటే సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది.

  ఇక ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం 'ఫేస్‌ఆఫ్' ఆధారంగా తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయమై రామ్ చరణ్ వివరణ ఇస్తూ... 'ఫేస్‌ఆఫ్' చిత్రంలోని ఒకరి ముఖాన్ని మరొకరికి అమర్చడం అనే చిన్న ఐడియా 'ఎవడు' సినిమాలో వుంటుంది. ఆ ఒక్క పాయింట్ తప్ప 'ఎవడు' కథకు 'ఫేస్‌ఆఫ్'కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు.

  అలాగే చిరంజీవి చిత్రాల్లోని హిట్‌సాంగ్స్‌ను మీ సినిమాల్లో రీమేక్ చేస్తున్నారు... 'ఎవడు'లో రీమేక్ సాంగ్స్ ఏమైనా వున్నాయా అని అడిగితే... 'ఎవడు'లో రీమేక్ సాంగ్స్ చేయడం లేదు. కొద్దిరోజుల పాటు రీమేక్ పాటలకు దూరంగా వుందామనుకుంటున్నాను అని వివరణ ఇచ్చారు. వేసవి చివరలో విడుదల చేయడమే లక్ష్యంగా త్వరిత గతిన సినిమా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు.

  ఆన్ లొకేషన్ స్టిల్స్... స్లైడ్ షో లో...

  ఈ సినిమాలో 15 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు.

  పెళ్లయిన దగ్గరినుంచి ‘నాయక్' ‘జంజీర్'... ఇప్పుడు ‘ఎవడు' షూటింగ్‌లతో తీరికలేకుండా గడుపుతున్నాను. రిలాక్స్‌గా ఇంటిపట్టున వుండే సమయమే చిక్కడం లేదు. అందుకే ‘ఎవడు' షూటింగ్ పూర్తయ్యాక రెండు నెలల విరామం తీసుకోబోతున్నాను అని అన్నారు.

  ‘నటుడన్నాక ప్రయోగాలు చేయాలి. భయంతో ఏ అవకాశాన్ని తిరస్కరించకూడదు. ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనులూ జరగవు' అని రామ్ చరణ్ అన్నారు.

  ‘ఎవడు' లో తన పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు రామ్ చరణ్.

  అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  మరో వైపు చెర్రీ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘జంజీర్'(తెలుగులో తుఫాన్) చిత్రం ఎవడు చిత్రం తర్వాత దాదాపు 50 రోజుల గ్యాప్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.

  రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. మే 9వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

  రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన ‘ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ‘ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

  జగదేక వీరుడు-అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంవటి మెమోరెబల్ సినిమాల విడుదలైన రోజైన మే 9వ తేదీన ‘ఎవడు' చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ శరవేగంగా రికార్డు రేట్లతో జరుగుతోంది.

  దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్‌ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అలరిస్తాయని''అన్నారు.

  ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.

  తన చిత్రం ఎవడు నైజాం రైట్స్ ని రామ్ చరణ్ రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు సమాచారం.

  English summary
  Ram Charan’s new film Yevadu shooting under the direction of Vamsi Padipalli is currently progressing in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X