»   » రామ్ చరణ్ 'ఆరెంజ్' ప్రస్తుతం ఏ స్టేజీలో ఉంది?

రామ్ చరణ్ 'ఆరెంజ్' ప్రస్తుతం ఏ స్టేజీలో ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం నిన్న(సోమవారం) సాయింత్రం మలేషియా వెళ్ళారు రామ్ చరణ్. అంతకు ముందురోజే యూనిట్ మొత్తం అక్కడకి చేరుకుంది. ఆదివారం తన తండ్రి చిరంజీవి పుట్టిన రోజు కావటంతో ఆ రోజు ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. ఇక మలేషియా షెడ్యూల్ ..సెప్టెంబర్ 12 వరకూ జరగనుంది. అక్కడ ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయనున్నారు.జెనిలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సోదరి మంజుల, ఆమె భర్త సంజయ్ స్వరూప్ గెస్ట్ లుగా కనిపిస్తారు. సెప్టెంబర్ లో ఆరెంజ్ ఆడియో విడుదల చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu