»   » ఆరెంజ్ పాటలు సింప్లీ సూపర్బ్..ఓ రేంజ్ కి తీసుకెలుతున్నాయి...!

ఆరెంజ్ పాటలు సింప్లీ సూపర్బ్..ఓ రేంజ్ కి తీసుకెలుతున్నాయి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మేలోడీస్‌ తో పాటు భావపూరితమైన 'ఆరెంజ్‌" పాటలు ఇటీవలే విడుదలై శ్రోతలను కట్టిపడేయడమే కాకుండా చార్ట్‌ ను రాక్‌ చేస్తున్నాయి. హారిస్ ఇంతకుముందు చేసిన తమిళ మూవీస్ అన్నిటికీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు కానీ ఎందుకో తెలుగులో 'వాసు','సైనికుడు','మున్నా' పాటల్లో లోపం ఉంది అనిపిస్తుంది. ఒకటి రెండు పాటలు బాగున్నా...పరిపూర్ణంగా ఆడియో మొత్తం నచ్చేసింది అని చెప్పేలా లేవు...మళ్లీ 'ఘర్షణ' బాగా చేసాడు. ఇప్పుడు 'ఆరెంజ్'....సింప్లీ సూపర్బ్.

ఆరెంజ్ పాటల్లో ఇంకో స్పెషాలిటి...డ్యూయట్స్ లేకపోవడం....ఉన్న ఆరు పాటలు హీరో మీద ఫోకస్ చేసినవే...కానీ అన్నిటిలో హీరోయిన్ గురించి పాడినవే అనిపిస్తుంది. ప్రేమ, విరహం, బాధ, సంతోషం కలగలిపిన వనమాలి సాహిత్యం బాగన్నాయంటున్నారు ప్రేక్షకులు. ఇక అసలు సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ....ఈ పాటలు మాత్రం ఆరెంజ్ ను ఓ రేంజకి తీసుకెళుతూ చార్ట్ ను రాక్ చేస్తున్నాయి..రామ్‌ చరణ్‌, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అజనా ప్రొడక్షన్‌ బ్యానర్‌ లో నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీస్‌ జై రాజ్‌ స్వరపరిచిన పాటలు సినిమా రిలీజ్‌ కాకముందే సినిమా హిట్‌ కి నాంది పలికాయి. ఇక 'ఆరెంజ్‌" చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu