»   » కఠినమైన వర్కౌట్లతో చంపేస్తున్నాడు: రామ్ చరణ్..!?

కఠినమైన వర్కౌట్లతో చంపేస్తున్నాడు: రామ్ చరణ్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరంజ్" తర్వాత రామ్ చరణ్ కమిట్ అయిన 'మెరుపు"ఆగింది. సంపత్ నంది దర్శకత్వంలో అతను ఓ చిత్రం కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. ఈ సమయాన్ని వృదా చేసుకోకుండా రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని మియామీ నగరంలో వున్న సంగతి అందరికీ తెలిసిందే.

తన తదుపరి సినిమాలో మరింత స్లిమ్ గా, అందంగా కనపడడానికి అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'డేవిడ్ బార్టన్స్' జిమ్ లో కఠినమైన వర్కౌట్ చేయిస్తున్నాడని చంపేస్తున్నాడని చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బీచ్ ఒడ్డున ఇసుకలో ఐదు కిలోమీటర్లు పరిగెత్తించాడని కూడా పేర్కొన్నాడు. ఇసుకలో నడవడమే కష్టం, అలాంటిది పరిగెత్తడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఈ వర్కౌట్ లు చేసి..చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. డేవిడ్ బార్టన్స్ జిమ్ లో వున్న అత్యాధునికమైన సౌకర్యాలను, అక్కడి ట్రైనర్స్ ను చూసి రామ్ చరణ్ ఆశ్చర్యపోతున్నాడు.

'ఇంతకు ముందు చాలా మంది దగ్గర ట్రైనింగ్ పొందాను. కానీ, డేవిడ్ బార్టన్స్ ని బెస్ట్ లో బెస్ట్ గా చెప్పాలి. మన దేశంలో కూడా వీళ్ల జిమ్ ఒకటి వుంటే బాగుంటుంది" అంటున్నాడు చరణ్. మరో ఇరవై రోజుల్లో ఓ కొత్త చరణ్ ని మనం చూడబోతున్నామన్న మాట!

English summary
Ram Charan is relaxing in Miami, florida for one month. He is working out at David Barton’s gym over there and tweeted that “i’m in miami training for my next movie. trying to give you guys a very new look..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu