»   » చైనాలో ‘రచ్చ’ చేస్తున్న రామ్‌చరణ్ గ్యాంగ్

చైనాలో ‘రచ్చ’ చేస్తున్న రామ్‌చరణ్ గ్యాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా తనయుడు రామ్ చరణ్ హీరోయిగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ" సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇండియాలో కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఇటీవలే బ్యాంకాక్, థాయ్ లాండ్ లలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 'రచ్చ" షూటింగ్ స్పాట్ చైనాకు మారింది. 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా" లాంటి ఎన్నో ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలు ఉండటంతో దర్శక నిర్మాతలు కొన్ని సీన్లను చిత్రీకరించడానికి చైనాను ఎంపిక చేసుకున్నారు.

ఇందులో రామ్ చరణ్ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. రామ్ చరణ్ ను ప్రేమించే పాత్రలో ఓ పెద్ద బిలియనీర్ కూతురుగా తమన్నా నటిస్తోంది. అజ్మల్ ఇందులో ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్ వి.ప్రసాద్, పరాశ్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

English summary
Ram Charan Teja’s undershoot film Racha is progressing at a rapid pace. The movie has recently wrapped up the Bangkok and Thailand schedule and now the unit has rushed to China for wrapping up few vital scenes in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu