For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చిన సినిమా.. రాంచరణ్ చేతుల మీదుగా పునాదిరాళ్లు..

  By Rajababu
  |

  మంచి బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే సినిమా పరిశ్రమలో రాణించాలంటే చాలా కష్టం. అదీ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న రోజుల్లో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఇక మరీ కష్టం. అలాంటి రోజుల్లో శివశంకర వరప్రసాద్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి చిరంజీవిగా విశ్వరూపం చూపాడు. అంచెలంచెలుగా ఎదిగి సినిమా ప్రేక్షకుల్లో హృదయాల్లో మెగాస్టార్‌గా మారాడు. చిరంజీవి కెరీర్‌లో అద్భుతమైన సినిమాల గురించి తెలిపే విధంగా పునాదిరాళ్లు పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది.

   1978లో మొదలైన చిరంజీవి

  1978లో మొదలైన చిరంజీవి

  1978లో పునాదిరాళ్లతో మొదలైన చిరంజీవి మహాప్రస్థానం ఖైదీ నంబర్ 150 వరకు నిరాటకంగా సాగింది. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో చిన్న చిన్న తడబాట్లు తప్ప ఆయనకు ఎదురేలేకుండా పోయింది.

   బాలచందర్ ప్రశంస

  బాలచందర్ ప్రశంస

  డాన్యులు, ఫైట్లు, యాక్టింగ్‌తోపాటు అన్ని విభాగాలపై తన ప్రభావం చూపుతూ ప్రేక్షకులు, సినీ విమర్శకులు, సహ నటుల మనసు దోచుకొన్నాడు. నటనలో చిరంజీవి పరిణతి చూసి ప్రముఖ దర్శకుడు, బహుముఖ ప్రఙ్జాశాలి బాలచందర్ ముచ్చటపడిపోయారు. ఓ సందర్బంలో చిరంజీవిలో ఓ కమల్ హాసన్, రజనీకాంత్ దాగి ఉన్నారు అనే కామెంట్ చేయడం మెగాస్టార్ ప్రతిభకు అద్దం పట్టింది.

   చిరంజీవి కెరీర్‌కు పునాది

  చిరంజీవి కెరీర్‌కు పునాది

  చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి శిక్షణ పొందిన తర్వాత 1978లో చిరంజీవి నటించిన తొలి సినిమా "పునాది రాళ్లు'. చిత్రంతోనే సినీరంగంలోకి కాలు మోపాడు. అయితే ప్రాణం ఖరీదు చిత్రం మొదలు విడుదలైనా పునాదిరాళ్లు చిత్రమే చిరంజీవికి కెరీర్‌కు పునాది వేసింది.

   సావిత్రితో కలిసి చిరంజీవి

  సావిత్రితో కలిసి చిరంజీవి

  పునాదిరాళ్లు సినిమా టైటిల్ చిరంజీవి కెరీర్‌కు పరిపూర్ణతను ఇచ్చింది. ఈ చిత్రంలో మహానటి సావిత్రితో చిరంజీవి కలిసి నటించారు. ఈ చిత్రంలో గోకిన రామారావు, ఆలీ, రోజా రమణి, నరసింహారాజు, కవిత తదితరులు నటించారు. ఈ చిత్రంలో నటించిన గోకిన రామారావును నంది అవార్డు వరించింది. అబ్దుల్ ఖాదిర్ నిర్మాతగా వహించిన చిత్రానికి పీఎస్ నివాస్ దర్శకత్వం వహించగా, జే ప్రేమ్ జీ సంగీతం అందించారు.

   పునాదిరాళ్లు టైటిల్‌తో పుస్తకం

  పునాదిరాళ్లు టైటిల్‌తో పుస్తకం

  అలాంటి ప్రత్యేకతలు, విశిష్టత ఉన్న పునాది రాళ్లు చిత్రంపై, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని కీలక సంఘటనలకు పుస్తకం కల్పించారు రచయిత గౌతమ్ రావూరి. పునాదిరాళ్లు పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని మెగా పవన్ స్టార్ రాంచరణ్ విడుదల చేశారు.

   చిరంజీవి 40 చిత్రాలతో

  చిరంజీవి 40 చిత్రాలతో

  తొలి ఎడిషన్‌గా పాఠకుల ముందుకు వచ్చిన ఈ పుస్తకంలో చిరంజీవి నటించిన 40 చిత్రాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరిచారు గౌతమ్ రావూరి. ఈ పుస్తకాన్ని రాంచరణ్ ఆవిష్కరించి స్వయంగా సంతకం చేసి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు అందజేశారు.

   రచయితగా గౌతమ్ రావూరి

  రచయితగా గౌతమ్ రావూరి

  చిరంజీవి నట జీవితంలో ప్రేక్షకులకు, అభిమానులకు తెలియని పలు అంశాలను రచయిత గౌతమ్ ప్రస్తావించారు. 40 ఏళ్ల చిరంజీవి నట ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని రచించినట్టు ఆయన తెలిపారు. దీనికి రెండో ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

  English summary
  RamCharan released "Punadirallu" book written on Megastar Chiranjeevi's film career by Gowtham ravuri. The first edition of the book describes the journey of the actor's first 40 films. Published on the occasion of 40 years of megastar's film career. The second edition will follow.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X