»   »  కల్లు తాగిన కోతి: రామ్ చరణ్ కామెంట్ ‘దాసరి’ పైనా?

కల్లు తాగిన కోతి: రామ్ చరణ్ కామెంట్ ‘దాసరి’ పైనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషనల్ నెట్వర్కింగ్ పేజీలో ఓ సెన్సేషన్ కామెంట్ చేసారు. ‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే, మీరే ఊహించుకోండి' అంటూ మైకు పట్టుకున్న కోతి బొమ్మను పోస్టు చేసాడు చెర్రీ. అయితే చెర్రీ చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్లో పాపులర్ అయిన ఓ సినీయర్ డైరెక్టర్‌ను ఉద్దేశించే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సదరు సీనియర్ డైరెక్టర్‌తో పరోక్షంగా మాటల యుద్ధంగానికి దిగారు.

Ram Charan comment

ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఎలారు. వారి తర్వాత ఆ రేంజిలో వెలుగొందిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చిరంజీవి తక్కువ చేసి మాట్లాడారు. దీనికి కౌంటర్ గానే రామ్ చరణ్ ఈ పోస్టు చేసినట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Post by Ram Charan.

నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు కూడా దాసరి వ్యాఖ్యలకు కౌంటర్ అనే టాక్ వినిపిస్తోంది. ‘రాముడు లేని రామాయణం చదవం చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. సంవత్సరాలు గడిచినా గుణం మారని దృవనక్షత్రం మెగా స్టార్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గార్ల తరువాత స్వయం కృషితో నెంబర్ 1 స్థానాన్ని అదిరోహించి మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమను ఏలిన మకుటం లేని మహారాజు అని, తెలుగు క్యాలెండర్‌లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్‌లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్లు ఉంటాయి' అంటూ ట్విట్ చేసాడు.

డ్యాన్సు నేర్చుకోవాలంటే, ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలంటే అంతెందుకు చివరిచి నడవాలంటే, నిలబడాలంటే కూడా మెగాస్టార్ నుండి నేర్చుకున్నవే. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అంటూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే యువత అనేకం. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నుంచి నెంబర్‌వన్ ప్రొడ్యూసర్ దాకా ఎదురుచూసేది చిరంజీవి సినిమా కోసమే. పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం, మెగాస్టార్ జిందాబాద్ అంటూ ట్వీట్ చేసారు.

English summary
When it comes to giving it back, Ram Charan never spares Dasari Narayana Rao. Ram Charan posted a sensational comment on his facebook page, indirectly hinting it towards Dasari. This has caught fire with an immediate effect. "It is known that we cannot control a drunken Monkey, Now imagine it along with a mike", Ram Charan posted on his official Facebook page, mocking Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu