»   » ఉదయం ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ కు షాక్ ఇచ్చారు. అప్పుడు చెర్రీ ఫేస్ చూడాలి (ఫొటోలు)

ఉదయం ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ కు షాక్ ఇచ్చారు. అప్పుడు చెర్రీ ఫేస్ చూడాలి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం రామ్ చరణ్ కి ఆశ్చర్య పరిచే సంఘటన జరిగింది. అదేమింటే..ఆయన అమెరికా నుంచి వస్తూ ..షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే అభిమానులు ఆయనకోసం ఎదురుచూస్తూ కనపడటం. అబిమానులు ఆయన్ను చుట్టి ముట్టి అభినందనలతో ముంచెత్తారు. ఇది రామ్ చరణ్ ఊహించని సంఘటన. దీంతోనే ధృవ రేంజి సక్సెస్ ఏంటో ఆయనకు అర్దమైంది.

  తలపెట్టిన పని విజయవంతమైతే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్ధితి అలాగే ఉంది. ఆయన చాలా కాలం నుంచి ఓవర్ సీస్ లో రికార్డ్ వసూళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న చిన్న హీరోలు సైతం ఓవర్ సీస్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూండగా...చరణ్ మాత్రం వెనకబడి పోయాడు.


  ఈ నేపధ్యంలో ఈసారి ఆయన ధృష్టి మొత్తం ఓవర్ సీస్ పై పెట్టారు. సినిమా రిలీజ్ సమాయానికి అమెరికా వెళ్లారు. రామ్ చ‌ర‌ణ్ తేజ్ త‌న తాజా చిత్రం ధృవ చిత్రం ప్రీమియ‌ర్ షో చూసేందుకు అమెరికాలో అడుగుపెట్టి అక్కడ పబ్లిసిటీ కాంపైన్ చేసారు. చిత్ర యూనిట్‌తో క‌లిసి అత‌డు గురువారం అమెరికా చేరాడు. అమెరికాలోని ప‌లు న‌గ‌రాల్లో జ‌ర‌గ‌నున్న ధృవ ప్రీమియ‌ర్ షోల‌ను అత‌డు అక్క‌డి త‌న అభిమానుల‌తో క‌లిసి చూసాడు.


  తన సినిమాలకు ఇక్కడ మంచి కలెక్షన్లే వస్తున్నా ఓవర్సీస్ మార్కెట్ బాగాలేకపోవడం చరణ్ గమనించాడు. అందుకేనేమో సినిమా ప్రీమియర్ షో దగ్గర నుంచి అమెరికాలోనే ఉండి పలు థియేటర్లలో వరుసగా సినిమాలు చూస్తూ ఓవర్సీస్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.


  దాంతో ఈ స్టాటజీ వర్కవుట్ అయ్యింది. ధృవ చిత్రానికి ఇంతకు ముందు రామ్ చరణ్ ఏ చిత్రానికి రానంత రెస్పాన్స్ యుఎస్ లో వచ్చింది. దాంతో ఆయన ఉత్సాహంగా ఇండియాలో అడుగుపెట్టారు. ఆయన షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి రాగానే దిగిన ఫొటోలను ఇక్కడ షేర్ చేస్తున్నాం.


  కల నెరవేరింది

  కల నెరవేరింది

  రెగ్యులర్ కమర్షియల్ సినిమాల బాటను వీడి, తొలిసారిగా కాస్త కొత్తదనం కోసం ప్రయత్నించే క్రమంలో "ధృవ" సినిమా చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్ చరణ్, కమర్షియల్ గానూ మంచి ఊపులో కొనసాగుతున్నాడు. యుఎస్ బాక్సాఫీస్ వద్ద అందని ద్రాక్షగా మారిన 1 మిలియన్ డాలర్ కల సాకారం కావడంతో మంచి ఉత్సాహంలో ఉన్న చెర్రీ తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు.


  తరణ్ ఆదర్శ్ ట్వీట్

  తరణ్ ఆదర్శ్ ట్వీట్

  ఈ నెల 9న విడుదలైన చిత్రం ఆదివారానికి అమెరికాలో 1 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ‘ధృవ' శనివారం 342,652 డాలర్లు, ఆదివారం 146,138 డాలర్లు మొత్తం 957,859 డాలర్లు వసూలు చేసినట్లు తరణ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు.


  కమర్షియల్ గా ఊపులో ..

  కమర్షియల్ గా ఊపులో ..

  ఈ చిత్రం గురువారం 223,871 డాలర్లు(ప్రీ షో), శుక్రవారం 244,214 డాలర్లు మొత్తం 468,085 డాలర్లు రాబట్టినట్లు రెండు రోజుల క్రితం తరణ్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. "ధృవ" సినిమా చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్ చరణ్, కమర్షియల్ గానూ మంచి ఊపులో కొనసాగుతున్నాడు.


  ప్రీమియర్ షోలలో

  ప్రీమియర్ షోలలో

  ఇక అమెరికాలో జ‌రిగే ప్రీమియ‌ర్ షోల విష‌యానికొస్తే... ఈ నెల 8న సాయంత్రం 7 గంట‌ల‌కు న్యూజెర్సీలోని రీగ‌ల్ కామ‌ర్స్ స్టేడియంలో తొలి ప్రీమియ‌ర్ షో ఏర్పాటు చేసారు. ఆ త‌ర్వాత అదే రోజు రాత్రి ఈస్ట్ విండ్స‌ర్‌లో మ‌రో ప్రీమియ‌ర్ షోను ప్ర‌ద‌ర్శించారు. ఇక ఈ నెల 9న డెట్రాయిట్‌లోని యూఏ కామ‌ర్స్ స్టేడియం, 9న డ‌ల్లాస్ లోని వెబ్ చాపెల్‌కు చెందిన సినిమాక్స్‌లో ప్రీమియ‌ర్ షోలు నడిపారు. ప్రీమియ‌ర్ షోల సంద‌ర్భంగా త‌న అభిమానుల‌తో చెర్రీ ఫొటో సెష‌న్స్‌లోనూ పాలుపంచున్నాడు.


  టీవీ యాంకర్ సాయింతో ..

  టీవీ యాంకర్ సాయింతో ..

  అమెరికాలోని జాలీ హిట్స్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట‌వుతున్న ఈ ప్రీమియర్ షోల‌లో చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా ప్ర‌ముఖ టీవీ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రించింది. ప్రీమియ‌ర్ షోల‌కు సంబంధించిన టికెట్లు, ఇత‌ర వివ‌రాలు అందించేందుకు జాలీ హిట్స్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది.. మిషిగాన్‌లోని స్టెర్లింగ్ హైట్స్‌లో ఉన్న అతిథి ఇండియ‌న్ క్యూజిన్‌లోనూ ఈ షో టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని కూడా ఆ సంస్థ ప్ర‌క‌టించింది.


  ఫ్యాన్స్ హ్యాపీ

  ఫ్యాన్స్ హ్యాపీ

  తన సినిమాను ప్రమోట్ చేసుకోడంతో పాటు,ఫ్యాన్స్‌తో సమయం గడిపేందుకు రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారట. ఇక రాబోయే సినిమాలకు కూడా ఇలాగే చరణ్ రాపిడ్ గా పబ్లిసిటీ కాంపైన్ లో పాల్గొంటున్నారు.


  కలెక్షన్స్ మోత..

  కలెక్షన్స్ మోత..

  తెలుగు హీరోలు టాలీవుడ్ తర్వాత కన్నేసిన మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం వినబడే పేరు ఓవర్సీస్ మార్కెట్.సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు ఓవర్సీస్‌లలో కలెక్షన్ల మోత మోగడం ఖాయం.ఇదే విషయాన్ని చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాలు ఇప్పటికే నిజం చేసేశాయి. తాజాగా మెగా తనయుడు రామచరణ్ ఈ మార్కెట్లో పాగా వేసాడు.


  ప్రమోషన్ వర్కవుట్ అయ్యింది

  ప్రమోషన్ వర్కవుట్ అయ్యింది

  కొంతకాలంగా బాక్సాషీస్‌ను షేక్ చేయడంలో వెనుకపడిన రామ్ చరణ్ ‘ధృవ'‌తో ముందడగు వేశాడు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో సత్తా చాటాలని అమెరికా వెళ్లి ‘ధృవ' సినిమాను బాగానే ప్రమోట్ చేశాడు ఈ మెగా హీరో. ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల పెరగుదలకు ఒక కారణమయ్యందని చెప్పవచ్చు.


  ఆగని జోరు

  ఆగని జోరు

  విడుదలైన 5 రోజులకే ‘ధృవ'కి అదిరిపోయే కలెక్షన్లు దక్కాయి. ప్రంపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 9.18 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి 6వ రోజు కూడా జోరు కొనసాగిస్తుంది. మరొపక్క ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్కుకి చేరువలోకి వచ్చేశాడు రామ్ చరణ్. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే రామ్ చరణ్ తప్పకుండా కొత్త రికార్డులు సృష్టిస్తాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


  రికార్డ్ లు చూడకపోతే..

  రికార్డ్ లు చూడకపోతే..

  రికార్డుల సంగతి పక్కనబెడితే.. ‘ధృవ'ను బాగా ఆస్వాదించవచ్చని, ప్రతీ ఫ్రేమ్‌లోనూ కష్టం కనబడుతోందని, పాటల పిక్చరైజేషన్‌ బాగుందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఆ టాక్ సినిమాకు కలిసి వచ్చింది. ఫేక్ రివ్యూలు కాకుండా జెన్యూన్ రివ్యూలు సినిమాకు ప్లస్ అయ్యాయి.


  ఇలాగే ఉంటే బ్లాక్ బస్టర్

  ఇలాగే ఉంటే బ్లాక్ బస్టర్

  ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ కొట్టకుండా, రేసీ స్ర్కీన్‌ప్లేతో అదిరిపోయిందని కొంతమంది ఎన్నారై అభిమానులు ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌ యాక్టింగ్‌, స్టైలింగ్‌ అదిరిందని అక్కడ ప్రేక్షకులు తెలిపారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవడం ఖాయమని అన్నారు. ఇక, అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా చాలామంది చూసేశారు. తమిళ సినిమా కంటే తెలుగు సినిమాయే బాగుందని, దీన్ని మిస్‌ కావొద్దని ఎన్నారైలు ట్వీట్‌ చేశాడు.


  మంచి రివ్యూలే..

  మంచి రివ్యూలే..

  బ్రూస్లీ... భారీ డిజాస్టర్‌తో డీలా పడిపోయిన చరణ్.. తమిళ సినిమా రీమేక్‌ చేసి సేఫ్ గేమ్ ఆడాడు. ధృవ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. సినిమా బాగుందని టాక్ రావడంతో చరణ్ సహా చిత్రబృందం అంతా సంబరాల్లో మునిగిపోయారు. రామ్ చరణ్, అరవింద స్వామి కలయికలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్‌లో బాగానే కలెక్షన్లు సాధిస్తోంది.


  జనతాను దాటేసింది

  జనతాను దాటేసింది

  ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్' సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసింది. సినిమా విడుదలయిన తర్వాత మొదటి శనివారం వచ్చే కలెక్షన్లలో ధృవ సినిమా.. జనతాగ్యారేజ్‌ను దాటేసిది. కానీ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' సినిమా కలెక్షన్లకు మాత్రం చేరుకోలేకపోయింది. ధృవకు మొదటి శనివారం.. 343 వేల అమెరికన్ డాలర్లు రాగా.. జనతాగ్యారేజ్ మాత్రం 283 వేల డాలర్లు సంపాదించింది. నాన్నకు ప్రేమతో సినిమా అయితే 385 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. అయితే ఇది కేవలం వారాంతంలో వచ్చిన కలెక్షన్లు మాత్రమేనని, కొద్ది రోజులు ఆగితే జనతా గ్యారేజ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో లేదో తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


  English summary
  Early in the morning today fans have reached to Shamshabad Airport to welcome Ram Charan. As he's not expecting such fanfare and hungama, he has got shocked and few fans even mobbed Charan to get a shake hand with him. Well, all this reaction is something Charan owes to "Dhruva", directed by Surender Reddy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more