చవకబారు తనమే: పవన్ కళ్యాణ్‌ను లాగడంపై రామ్ చరణ్ సంచలన కామెంట్స్!

By Bojja Kumar

కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా జరుగుతున్న పోరాటం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు చివరకు..... పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ అయ్యేలా చేశాయి. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి అనే ఆయన వ్యాఖ్యలపై..... శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించడం, ఆయనపై బూతులు ప్రయోగిస్తూ కామెంట్స్ చేయడంతో తెలుగు సినిమా పరిశ్రమలో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. తాజాగా ఈ విషయమై రామ్ చరణ్ కూడా ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు.

మన ఇండస్ట్రీ కుటుంబం లాంటిది, మహిళలకు గౌరవం ఉంది

మన ఇండస్ట్రీ కుటుంబం లాంటిది, మహిళలకు గౌరవం ఉంది

అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ లో మహిళలలను ఎప్పుడూ అత్యంత గౌరవం తో చూస్తారు.... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

న్యాయబద్ధంగా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి

న్యాయబద్ధంగా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి

ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధం గా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి.... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా టాలీవుడ్లో శ్రీరెడ్డి, మరికొందరు చేస్తున్న వ్యాఖ్యలను, చేష్టలను పరోక్షంగా తప్పుబట్టారు.

అలా చేయడం చవకబారుతనమే...

కొందరి పేర్లు అనవసరం గా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనం గా ఉంటుంది.... అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు మెగా పవర్ స్టార్.

పరోక్షంగా రియాక్ట్ అయిన నితిన్

ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. జస్ట్ వెయిట్... ఇట్స్ కమింగ్ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అంటున్నారు ఫ్యాన్స్.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. బాబాయ్‌కి మద్దతుగా పదునైన పదజాలంలో ఆయన మద్దతుగా నిలిచారు. ఇందులో ఎక్కడ కూడా శ్రీరెడ్డి ప్రస్తావన లేక పోయినా ఆమెను ఉద్దేశించే వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశాడని టాక్.

కోన వెంకట్ కూడా

నా మనసు చాలా బాధపడింది. కానీ ఎలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయదలుచుకోలేదు. ఎవరిపైనా పర్సనల్ ఎటాక్స్ చేయదలుచుకోలేదు. నా సోల్‌మేట్‌ను ఎవరూ టచ్ చేయలేరు. ఆయన ఒక పెద్ద ఆశయంతో ముందుకు సాగుతున్నారు అంటూ కోన ట్వీట్ చేశారు.

శ్రీరెడ్డి ఇలా చేయడం వల్లే ఇదంతా....

శ్రీరెడ్డి ఇలా చేయడం వల్లే ఇదంతా....

పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు అయి ఉండి..... పోరాటం చేస్తున్న మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లాలని ఆయన చెబుతున్నారు.... ఈ విషయం ఆయన సలహా ఇచ్చే వరకు మాకు తెలియదు మరి. పవన్ కళ్యాణ్‌ను అన్న అని పిలిచినందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నాను అంటూ కెమెరాల ముందే తనను తాను చెప్పుతో కొట్టుకుని అవమానించుకుంది శ్రీరెడ్డి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద అర్జున రెడ్డి మూవీ బూతు డైలాగ్ మాదా*****త్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయింది.... ఈ పరిణామాల నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఏకమైంది. ఆల్రెడీ మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా కౌంటర్ ఇవ్వగా, ఇండస్ట్రీకి చెందిన పలువురు శ్రీరెడ్డి చర్యను తప్పుబడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X