For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైభవంగా రాంచరణ్ #RC15 ప్రారంభం.. టైటిల్ ఇదేనంటూ ప్రచారం.. చిరంజీవి చేతుల మీదుగా..

  |

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ RRR సినిమా అనంతరం ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకుంటాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక చరణ్ కిడా ఎన్నో కథలపై చర్చలు జరిపి ఫైనల్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

  అసలు సినిమా ఇంత త్వరగా సెట్స్ పైకి వస్తుందా లేదా అనే అనుమానాలు వైరల్ అవుతుండగా దర్శకుడు శంకర్ జెట్ స్పీడ్ లోనే ప్రాజెక్ట్ ను ట్రాక్ లోకి తెచ్చేశాడు. ఇక ఈ సినిమాను హైదరాబాద్ లాంచ్ చేశారు. టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ అలాగే నటించబోయే స్టార్ క్యాస్టింగ్ విషయంలోకి వెళితే...

  RC 15.. మెగాస్టార్ చేతుల మీదుగా

  RC 15.. మెగాస్టార్ చేతుల మీదుగా

  రంగస్థలం సినిమా చూసిన తర్వాత దర్శకుడు శంకర్ రామ్ చరణ్ నటనను చూసి ఫిదా అయ్యాడు. ఎలాగైనా అతనితో ఒక సినిమా చేయాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఒక కథను అయితే సెట్ చేశాడు. ఇక నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా సినిమాను లాంచ్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మెగాస్టార్ చేతుల మీదుగా మొదటి క్లాప్ తో ఫస్ట్ షాట్ ను షూట్ చేశారు.

  కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

  కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

  సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో చిత్ర నటీనటులతో పాటు యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరు బ్లేజర్ లో కనిపిస్తుండటం విశేషం. ఇటీవల దర్శకుడు శంకర్ ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అందులో సినిమాలో నటించే నటీనటులతో పాటు నిర్మాతలు టెక్నీషియన్స్ కూడా బ్లేజర్ వేసుకొని దర్శనమిచ్చారు.

  విశ్వంభర.. అర్థమేమిటి అంటే..

  విశ్వంభర.. అర్థమేమిటి అంటే..

  ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథకు తగ్గట్టుగా 'విశ్వంభర' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ అర్థం ఏమిటి అంటే ఏదైనా కావాలని పరితపించే వాడు తప్పకుండా దాన్ని సాధించే వరకు పోరాడే వ్యక్తిని విశ్వంభర అని అంటారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయకుడు ఒక మంచి పని చేయడం కోసం దేని కోసమైనా సరే సిద్ధమవుతాడు. అందుకే కథకు సెట్టయ్యేలా ఉండాలని ఆ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

  స్టార్ క్యాస్టింగ్

  స్టార్ క్యాస్టింగ్

  ఇక ఈ సినిమాలో నటీనటులు కూడా ఆ విషయంలో కూడా దర్శకుడు శంకర్ భారీగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే స్టార్ నటుడు జయరామ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నవీన్ చంద్ర, అంజలి వంటి టాలెంటెడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

   రిలీజ్ ఎప్పుడంటే..

  రిలీజ్ ఎప్పుడంటే..

  ఇక ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు మొదటి సారి భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తగ్గట్లుగా భారీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసి 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఈ సినిమాతో తన మార్కెట్ ను ఏ స్థాయిలో పెంచుకుంటాడో చూడాలి.

  Bazaar Rowdy Movie Hero Sampoornesh Babu Exclusive Interview | Part 3
  తారాగణం & సిబ్బంది

  తారాగణం & సిబ్బంది

  నటుడు: రామ్‌చరణ్

  నటి: కియారా అద్వానీ
  దర్శకుడు: శంకర్
  తారాగణం: సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి,జయరామ్
  నిర్మాత: దిల్‌రాజు
  సంగీతం: తమన్
  కెమెరా: తిరు
  డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
  సాహిత్యం: రామ్‌జో, అనంత శ్రీరామ్

  English summary
  Ram Charan, Shankar, Dil Raju's RC15 Movie shoot begins in hyderabad
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X