»   »  ఆనందం కలిగించింది: రామ్‌చరణ్‌

ఆనందం కలిగించింది: రామ్‌చరణ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రిట్జ్‌ పత్రిక ఇటీవల నటుడు రామ్‌చరణ్‌కు ‘మోస్ట్‌ అడ్మైర్డ్‌ సెలబ్రిటీ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2015' అవార్డు ప్రదానం చేసింది. ఈ పురస్కారం దక్కడం తనకెంతో ఆనందం కలిగించిందని రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు.

Humbled to have received the Most Admired Celebrity Icon of the Year by RITZ. Thanks to all my fans who have constantly showered love on me !!

Posted by Ram Charan on 14 December 2015

ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ... ఫొటోను పోస్ట్‌ చేశారు. కళలు, రాజకీయాలు, వ్యాపారాల్లో రాణించిన వ్యక్తులకు రిట్జ్‌ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.

అలాగే ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై ఈ సందర్బంగా రామ్ చరణ్ దాదాపు క్లారిటీ ఇచ్చేసారు . తమిళంలో హిట్టయిన 'కత్తి'ని తెలుగులో రీమేక్ చేస్తారని, అదే నాన్న 150వ మూవీ అని హీరో రామ్ చరణ్ కన్ఫార్మ్ చేసి చెప్పేసాడు. బెంగుళూరు‌లో జరిగిన రిట్జ్ ఐకాన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ, సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Ram Charan shared inCelebrity Icon of the Year by RITZ fb

రామ్ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ చిరు 150వ సినిమా గురించి స్పష్టతనిచ్చారు. కత్తి రీమేక్ చేయనున్న మాట నిజమేనని, తెరకెక్కించేది వినాయక్ అని ఓ పెద్ద చర్చకు తెరదించారు.

గతంలో తమిళంలో హిట్టయిన 'రమణ' సినిమాని తెలుగులో 'ఠాగూర్' మూవీగా వివి వినాయిక్ డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఓ రేంజ్‌లో రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి' రీమేక్‌ని కూడా వీవీకి అప్పగించాలని మెగాక్యాంప్ ఓ నిర్ణయానికి వచ్చి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Ram Charan shared in fb: Humbled to have received the Most Admired Celebrity Icon of the Year by RITZ. Thanks to all my fans who have constantly showered love on me !!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu