»   » పవన్ తో విభేధం అనే రూమర్ కి అలా కౌంటర్ ఇచ్చాడు

పవన్ తో విభేధం అనే రూమర్ కి అలా కౌంటర్ ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది ఆడియో పంక్షన్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ అటెండ్ కాలేదు. ముఖ్యంగా చిరంజీవి,రామ్ చరణ్ రాలేదు. దాంతో మీడియాలో పవన్, మెగా ఫ్యామిలీల మధ్య విభేధాలు తారా స్దాయికి చేరుకున్నాయని రూమర్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాక రామ్ చరణ్,పవన్ సినిమాలు వారం తేడాలో పోటీ పడుతూ విడుదల అవుతున్నాయి. అది కూడా ఆ రూమర్స్ కి బలం చేకూర్చినట్లైంది.

  అయితే రామ్ చరణ్ తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ కి వచ్చి...పవన్ తరుపున...ట్రోఫీ అందుకోవటంతో అంతా సైలెంట్ అయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రానికి గానూ పవన్ కళ్యాణ్ కి ఆ అవార్డు వచ్చింది. ఆ విధంగా రామ్ చరణ్ సైలెంట్ గా... తమ మధ్య విభేధాలు లేవని స్పష్టం చేసాడని అంటున్నారు.

  రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' చిత్రం జులై 31న విడుదలకు సిద్ధం అవుతుండగా....వారం గ్యాప్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమా వల్ల చరణ్ సినిమా ఏమైనా ప్లాబ్లం రావొచ్చు, కలెక్షన్లు తగ్గిపోవచ్చనే ఒక వాదన మొదలైంది. సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు.


  దిల్ రాజు మాట్లాడుతూ...'మేము ముందుగా ఎవడు వాయిదా వెయ్యాలని అనుకున్నాం కానీ సరైన తేదీ దొరకలేదు. అత్తారింటికి దారేది డేట్ అనౌన్స్ చేసేసారు, అలాగే జంజీర్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. కావున 31నే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. కానీ దీనివల్ల ఎలాంటి సమస్య లేదు.. గదర్, లగాన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ రెండూ ట్రెండ్ సెట్ చేసాయని' అన్నారు. 'ఎవడు సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదు, జులై 31నే విడుదల చేయబోతున్నాం. అత్తారింటికి దారేది సినిమా వల్ల ఎవడు సినిమాకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నాం. ఇప్పటికే అనేక కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ ఎవడు చిత్రంతో మరో విజయం సొంతం చేసుకుంటారు' అని వెల్లడించారు.

  English summary
  There were rumors of rift again in mega family when Pawan Kalyan didn’t make to the music launch of Ram Charan’s Yevadu. When Chiranjeevi and Ram Charan didn’t attend the music launch of Atharintiki Daredi, the rumor mills started churning again despite the announcement that the music launch is done with just cast and crewmembers of the film without inviting any other celebrities. Filmfare awards function was held on the next day and Pawan Kalyan has won the best actor award for his performance in Gabbar Singh. It was Ram Charan who received the trophy on behalf of Pawan Kalyan. This act has silenced critics! 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more