»   »  రామ్ చరణ్- శ్రీను వైట్ల సినిమా డిటేల్స్(అఫీషియల్)

రామ్ చరణ్- శ్రీను వైట్ల సినిమా డిటేల్స్(అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల తనతో 'నాయక్' చిత్రాన్ని నిర్మించిన డి.వి.వి.దానయ్యతో ఓ సినిమా చేయడానికి రామ్‌చరణ్ అంగీకరించారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం ఆగస్టులో లాంఛనంగా ప్రారంభం కానుందని చిత్ర నిర్మాత మీడియాకు తెలియచేసారు.

రామ్‌చరణ్‌ - శ్రీనువైట్ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొనే అవకాశాలున్నాయని గత కొంతకాలంగా ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌లతో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన దానయ్య.. ఇప్పుడు చరణ్‌తో రెండో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే శ్రీనువైట్ల చరణ్‌ కోసం కథ సిద్ధం చేశారట. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Ram Charan - Srinu Vaitla film to roll in August

నిర్మాత మాట్లాడుతూ ''దేశముదురు', 'జులాయి', 'నాయక్‌', 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'... చిత్రాల్ని మా సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు మరోసారి చరణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు.

చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తుండగా, మహేశ్‌తో శ్రీను వైట్ల 'ఆగడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు జూలై నాటికి పూర్తవుతాయని సమాచారం. అంటే రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీను గతంలో చిరంజీవి హీరోగా 'అందరివాడు'ను రూపొందించారు. ఇప్పుడు ఆయన కుమారుడిని ఆయన డైరెక్ట్ చేయబోవటంతో ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.

English summary
The muhurtham of Ram Charan and Srinu Vaitla film has been fixed. The film will be launched in August. This film will be produced by Danayya. For the first time Ram Charan will be working with Srinu Vaitla. Presently Vaitla is busy with Mahesh Babu’s Aagadu. Ram Charan is also wrapping up his next film directed by Krishna Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu