»   » రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ బర్త్ డే విషెస్ పోస్టర్ (ఫోటోస్)

రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ బర్త్ డే విషెస్ పోస్టర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 16న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత డివివి దానయ్య ‘డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ram Charan-Srinu Vaitla New Movie First Look

ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారుకాలేదు. ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

Ram Charan-Srinu Vaitla New Movie First Look

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

English summary
Srinu Vaitla Movie Ram Charan Birthday Wishes Poster released.
Please Wait while comments are loading...