twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ హామీ ...ప్యాన్స్ హ్యాపీ(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నాన్న 150వ సినిమా కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కథలు వింటున్నాం. ఆ సినిమా గురించి ఒకటి మాత్రం కచ్చితంగా చెబుతాను. రికార్డుల కోసమని... కత్తులు తిప్పడం, మీసాలు మెలేయడంలాంటివి అస్సలు జరగవు. అదొక మంచి సినిమా అవుతుంది. ఆ లక్ష్యంతోనే కథని ఎంపిక చేసుకొంటున్నాం'' అన్నారు రామ్‌చరణ్‌.

    మరోప్రక్క ఈ ప్రాజెక్టు విషయమై ఓ నెల రోజుల్లో పూర్తి ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో రామ్ చరణ్ ఇలా కథపై క్లారిటీ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుందంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత అనే సంగతి తెలిసిందే.

    స్లైడ్ షోలో ఎవరు డైరక్టర్...వివరాలు

    దర్శకుడు ఎవరంటే...

    దర్శకుడు ఎవరంటే...

    ఈ చిత్రానికి వివి వినాయిక్ దర్శకుడు అయ్యే అవకాసాలు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వినాయిక్ రచయితలతో కంటిన్యూగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    భారీ బడ్జెటే

    భారీ బడ్జెటే

    అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టాలనే నిర్ణయానికి రామ్ చరణ్ వచ్చినట్లు తెలుస్తోంది. చిరు కోసం కథ రెడీ చేస్తున్న దర్శకులకు ఈ విషయాన్ని,బడ్జెట్ ని క్లియర్ గా చెప్పినట్లు సమచారం. దాంతో ఆ మేరుకు కథలో మార్పులు చేర్పులు చేసుకుంటారని చెప్పినట్లు వినపడుతోంది.

    ట్రెండ్ లోనే

    ట్రెండ్ లోనే

    ప్రస్తుతం కామెడీలు బయిట బాగా నడుస్తున్నాయి. దాంతో కథలో ఎక్కువ ప్రయారిటీ కామెడీకే ఇవ్వాలని నిర్ణయించుకుని, ఆ పరిధిలోనే కథని వెతకమని పురమాయించినట్లు చెప్తున్నారు.

     కొత్త హీరోలాగ...

    కొత్త హీరోలాగ...

    చిరు 150 చిత్రం అంటే అందరి దృష్టీ ఆ సినిమాపైనే ఉంటుందనే సంగతి తెలిసిందే. దాంతో ప్రతీ విషయంలోనూ అన్నీ జాగ్రత్తలూ తీసుకుని, దాదాపు కొత్త హీరోని లాంచ్ చేస్తున్న సమయంలో తీసుకున్న జాగ్రత్తలు వంటివి ఈ చిత్రం విషయంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ఇదో సమస్య

    ఇదో సమస్య

    ఇప్పుడు చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఎవరని ఎంపిక చేయాలనేది ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ తీసుకుంటే క్రేజ్ ఉండదు. అలాగని యంగ్ హీరోయిన్స్ ని తీసుకుంటే జోడి సరిగ్గా ఉండదు. అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

     చిరంజీవి మాట్లాడుతూ...

    చిరంజీవి మాట్లాడుతూ...

    అనుకొనో, అనుకోకుండానో ఒక వెసులుబాటు సమయం నాకు దొరికింది. అభిమానులూ కోరుకొంటున్నారు. రకరకాల సందర్భాల్లో శ్రేయోభిలాషులూ అడుగుతూనే వస్తున్నారు. 'బుడ్డా హోగా తేరా బాప్‌' సినిమా సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ 'చిరంజీవీ! మీరు ఎంత బిజీగా ఉన్నా 150వ సినిమా చేయాలి, 149వ నెంబర్‌ కరెక్టు కాదు' అని చెప్పడం మొదలుకొని... ఇటీవల 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో 'మీరు మళ్లీ సినిమా చేయాలన్నది నాది మాత్రమే కాదు, ప్రేక్షకుల కోరిక కూడా' అని నాగార్జున అనడం వరకు చాలామంది ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశమూ దొరికింది అన్నారు.

    మేం చెప్పలేదు

    మేం చెప్పలేదు

    అలాగే నా పుట్టిన రోజునాడు 150వ సినిమా ప్రకటిస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. పత్రికల్లో, టీవీల్లో వచ్చిందే. అన్నీ కుదిరితే అలాగే ప్రకటించాలనుకొన్నాం, కానీ ఇంకా కథ సిద్ధం కాలేదు. రెండు మూడు కథలు అనుకొన్నా నిర్ణయం తీసుకోలేదు అని చిరంజీవి అన్నారు.

     స్టోరీ గురించి

    స్టోరీ గురించి

    చిరంజీవి మాట్లాడుతూ...చాలా కథలు విన్నాను. ఈమధ్యే ఢిల్లీలో తమిళ రచయితలు కూడా కొన్ని కథలు చెప్పారు. అయితే కొందరు అనుకొంటున్నట్టు ఓ గొప్ప సందేశాత్మక కథతోనో, ఏ స్వాతంత్య్ర సమరయోధుడిగానో రావాలనుకోవడం లేదు. ఒక సున్నితమైన కథతో, ఆద్యంతం సరదాగా సాగే సినిమాలో చేయాలనుకుంటున్నా. 'బావగారూ బాగున్నారా', 'అన్నయ్య', 'శంకర్‌దాదా ఎంబీబీయస్‌'లాంటి సినిమా చేయాలనుకొంటున్నా. మీ దగ్గరికి ఎలాంటి కథలు వస్తున్నాయి... అంచనాలు భారీగా ఉన్నాయని చాలా మంది బరువైన కథలు రాసుకొని వస్తున్నారు. కొన్ని రాజకీయ నేపథ్యంతో వచ్చాయి. నేను అలాంటి కథలు వద్దంటున్నాను అన్నారు.

    అంచనాలకు తగ్గట్టుగానే...

    అంచనాలకు తగ్గట్టుగానే...


    ఒక నటుడిగా నాపై రెండింతలు ఒత్తిడి కలుగుతోంది. పెద్ద విరామం తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. 'చిరంజీవి మళ్లీ తెరపై ఎలా కనిపిస్తాడో' అనే ఆసక్తి అందరిలోనూ ఉండడం, అంచనాలు పెరగిపోవడం ఇదంతా ఆషామాషీ కాదని నాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతున్నా. నా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో అవన్నీ వందశాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నాతో పాటు నా నిర్మాత రామ్‌చరణ్‌ పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాడు అన్నారు చిరు.

    డాన్స్ లు,ఫైట్స్

    డాన్స్ లు,ఫైట్స్

    డ్యాన్సులు, ఫైట్లు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు రానీయను. వాటికోసం ప్రత్యేకంగా సిద్ధం కావడం అంటూ ఏమీ ఉండదు. అవి నా ఒంట్లోనే ఉన్నాయి. కాకపోతే... సినిమా అనేసరికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. అందుకోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నా అన్నారు చిరు.

    రికార్జులు అక్కర్లేదు..

    రికార్జులు అక్కర్లేదు..

    ఇదివరకటితో పోలిస్తే సినిమా వ్యాపారంలోనూ చాలా మార్పులొచ్చాయి. మన సినిమాలు కూడా రూ: 100 కోట్ల మార్క్‌కి చేరువవుతున్నాయి. అయితే
    ఒక సినిమా చేసేటప్పుడు అలా వసూళ్ల గురించి, రికార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను. వందకోట్ల వసూళ్ల గురించి మాట్లాడుకొనే స్థాయికి మనం చేరుకోవడం శుభపరిణామం. ప్రతీసారీ మా సినిమానే రికార్డులు కొట్టాలనే అత్యాశలు నాకు ఉండవు. ఆమధ్య 'దూకుడు', ఇటీవల 'దృశ్యం', 'మనం'లాంటి గొప్ప చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇలాంటివి మరిన్ని రావాలి అన్నారు.

     అందుకే మా అబ్బాయే నిర్మాత

    అందుకే మా అబ్బాయే నిర్మాత

    ఇటీవలకాలంలో నేను పరిశ్రమలో గమనించిన ప్రధాన విషయం... నిర్మాణ వ్యయం అదుపులో ఉండటం లేదు. ఇదివరకటి కాలంలో మేం ప్రతీ విభాగంపైనా నిఘా వేసి ఒక వాచ్‌ డాగ్‌లా ఉంటూ సినిమా చేసేవాళ్లం. నిర్మాతకి ఎలాగైనా డబ్బు మిగలాలని ఆలోచించేవాళ్లం. ఆ ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు. మాకు ఎంతని చూసుకొంటున్నారు తప్ప నిర్మాత గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. నా 150వ సినిమా మేమే సొంతంగా నిర్మించాలనుకోవడానికి కారణం కూడా అదే.
    నన్ను మార్చేసింది.

    English summary
    'There is lot of enthusiasm around this 150th flick. Every hour or the other, inquiries are happening about it. As a producer, I will promise clarity about the prestigious flick in a month's time', said Charan,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X