అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆరంజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..!
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగేంద్రబాబు తమ సోంత బ్యానర్ అంజనా ప్రోడక్షన్స్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. హారిస్ జైరాజ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 25న విడుదల చేసి నవంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జెనీలియా, షాజన్ పదంసిలు నాయికులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ లవర్ బాయ్ గా కనిపిస్తారు. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక చిరంజీవి అభిమానుల సమక్షంలో విడుదల చేయడానికి నాగబాబు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఈ ఆడియో మహొత్సవానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ ప్రముఖులందరూ ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం.
ఇక సినిమా కధ విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ లవర్ బాయ్ లాగా నటిస్తున్నారు. గతంలో నటింటినటువంటి చిరుత మరియు మగధీర చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈసినిమాలో రామ్ చరణ్ తేజ్ ఓ కొత్త గెటప్ లో కనిపించనున్నారనేది ఫిలింమ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన రామ్ చరణ్ తేజ్ ఫోటోలలో ఓ సరికొత్త ట్రెండ్ కిశ్రీకారం చుట్టినట్టు కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆడియో కార్యక్రమంలో చిరంజీవి తన 150వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











