»   » నాకు నచ్చింది కానీ రీమేక్ చేయను: రామ్ చరణ్

నాకు నచ్చింది కానీ రీమేక్ చేయను: రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ కు ఏదైనా సినిమా బాగుంటే వెంటనే మెచ్చుకోవటం అనే మంచి అలవాటు ఉంది. రీసెంట్ గా ఆయన కన్నడ సూపర్ హిట్ చిత్రం "మిస్టర్&మిసెస్ రామాచారి" చిత్రం చూసారు. యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన ఆయన సినిమాపై ప్రశంసలు వర్షం కురింపించారు.

ఆయన పాపులర్ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ... నేను ఈ మధ్య కాలంలో చూసిన కన్నడ చిత్రాలల్లో "మిస్టర్&మిసెస్ రామాచారి" బెస్ట్ ఫిల్మ్. సినిమాలో హీరోగా చేసిన యశ్ చాలా బాగా చేసారు అన్నారు.

అలాగే తనకు ఈ చిత్రం రీమేక్ చేయమని ఆఫర్ వచ్చింది కానీ తను రిజెక్టు చేసానని చెప్పారు. జంజీర్ రీమేక్ చేసిన విషయం గుర్తు చేసుకున్న ఆయన అదో మిస్టిక్ గా చెప్తూ... ఒరిజనల్ చిత్రం బ్రిలియంట్ గా ఉన్నప్పుడు నేను రీమేక్ చేయటానికి ఇష్టపడను. ఎడాప్షన్స్, ఎక్సటెన్షన్స్ బాగుంటాయి అన్నారు.

Ram Charan Teja Praises Yash's 'Mr & Mrs Ramachari'

అలాగే తనకు కన్నడ సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు తెలిపారు. ఓ పూర్తి స్దాయి చిత్రంలో ఆయన గెస్ట్ గా నటించాలని ఉందని అన్నారు. అలాగే తనకు కన్నడ పరిశ్రమలో సుదీప్, కీర్తి కర్భంద వంటి స్నేహితులు ఉన్నారని అయితే అదంతా కేవలం ప్రొపిషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రామ్ చరణ్...తాజా చిత్రం విషయానికి వస్తే...

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', నాయిక 'రకుల్ ప్రీత్ సింగ్' ల తో పాటు భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమౌతుంది. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత చెప్పారు.

Ram Charan Teja Praises Yash's 'Mr & Mrs Ramachari'

దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ మా శ్రీను చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఈ సినిమాకి కుదిరింది. కొంత గాప్ తర్వాత మళ్ళీ మేము ఈ ప్రాజెక్ట్ కోసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

మేము, శ్రీను వైట్ల - కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ కథలనే నమ్ముతాం. అవే మమ్మల్ని ఈ స్థాయి కి తీసుకొచ్చాయి. ఈ సినిమా మా శ్రీను మార్క్ తో ఉండబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను." అన్నారు. గోపి మోహన్ మాట్లాడుతూ " మా శ్రీను గారితో మళ్ళీ కలిసి పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ వినాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు." అన్నారు. "శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ లు ఈ సినిమాకి కలిసి పని చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన స్రిప్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అన్నారు.

English summary
Ram Charan Teja has praised blockbuster Kannada movie "Mr & Mrs Ramachari". He has also appreciated Yash for his good work.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu