Just In
- 3 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 4 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 6 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నూర్ మహ్మద్ కుటుంబానికి రామ్ చరణ్ సహాయం.. మాట నిలబెట్టుకున్న మెగా పవర్‌స్టార్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ ఎంత ప్రత్యేకమో.. అభిమానుల్లో మెగా ఫ్యాన్స్‌ది అంతే ప్రత్యేకమైన స్థానం. దాదాపు నలభై యేళ్ల పాటు చిరంజీవి అభిమానిగా, చిరు అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించిన మెగా అభిమాని నూర్ మహ్మద్. అంతటి చిరు అభిమాని.. ఆ మధ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి మెగా హీరోలంతా సంతాపాన్ని తెలిపారు.

అప్‌డేట్స్ ఆపేసిన బన్నీ..
నూర్ మహ్మద్ మరణ వార్త తెలిసిన వెంటనే.. అల వైకుంఠపురములో అప్‌డేట్స్‌ను ఆపేశారు. ఆ రోజే ఓ పాటకు సంబంధించిన అప్‌డేట్ ప్రకటిస్తామని తెలిపారు. అయితే మెగా అభిమాని మృతితో తాము కలత చెందామని అందుకే అప్‌డేట్‌ను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

పరామర్శించిన చిరు, బన్నీ..
నూర్ మహ్మద్ అంటే మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. ఆయన మరణవార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ హుటాహుటిని వారి నివాసానిని చేరుకుని నూర్ మృతదేహానికి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఆర్థిక సహాయం చేస్తామని రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా మాటిచ్చాడు.

సోషల్ మీడియాలో స్పందించిన హీరోలు..
తమ అభిమాని మృతి చెందడంతో మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా ఫ్యామిలీలో ఓ వ్యక్తిని కోల్పోయామని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని రామ్ చరణ్ ప్రకటించాడు.

మాట నిలబెట్టుకున్న చెర్రీ..
ఆ నాడు ఇచ్చిన మాటను రామ్ చరణ్ ఈనాడు నిలబెట్టుకున్నాడు. నూర్ ఫ్యామిలీని ఇంటికి పిలిచి, కాసేపు ముచ్చటించిన అనంతరం రామ్ చరణ్... రూ. 10లక్షల చెక్‌ను అందజేశాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.