twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు సినీ నిర్మాణ సంస్థలు ప్రారంభిస్తున్న రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: త్వరలో రెండు కొత్త సినీ నిర్మాణ సంస్థలను స్థాపించబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. ‘కొణిదెల ప్రొడక్షన్స్', ‘వైట్ హార్స్ ఎంటర్టెన్మెంట్స్' పేరుతో ఇవి ఉంటాయని, నిర్మాతగా తన తొలి సినిమా తన తండ్రి చిరంజీవితో 150వ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విషయం ప్రకటిస్తామన్నారు.

    వచ్చే ఏడాది బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. ఇటీవలే సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి వెళ్లి బాబాయ్ ని కలిసాను. ఇద్దరం కలిసి పని చేసే విషయాలను చర్చించాం. బాబాయ్ నిర్మించే సినిమాలో వచ్చే ఏడాది నటిస్తాను అని తెలిపారు.

    రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా అక్టోబర్ 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబాయ్ ని సినిమా చూడటానికి ఆహ్వానించడానికే రామ్ చరణ్ వెళ్లినట్లు కూడా చెబుతున్నారు. కారణం ఏమైతేనేం... పవన్, రామ్ చరణ్ కలుసుకోవడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

    Ram Charan to launch two production houses

    రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా విషయానికొస్తే ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

    రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Actor Ram Charan, who awaits the release of forthcoming Telugu actioner “Bruce Lee: The Fighter”, says he will soon be launching two new production houses and also work with his star uncle Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X