»   » గోవాలో భార్యతో కలిసి రామ్ చరణ్ (ఫోటో)

గోవాలో భార్యతో కలిసి రామ్ చరణ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ఉపాసనతో కలిసి గోవాలో వాలిపోయాడు. నిన్న రాత్రే వీరు గోవాలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వెడ్డింగ్ సెర్మనీలో పాల్గొనేందుకు వారు గోవా వెళ్లారు. ఇక్కడ స్నేహితురాలితో దిగిన సెల్ఫీ షాట్ ఒకటి నెట్లో వైరల్ లా వ్యాపించింది. ఈ రోజు వాలంటైన్స్ డే కావడంతో ఇక్కడే ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నట్లు సమాచారం. రామ్ చరణ్, ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా మొదలు కాకముందే ఓ డిస్ట్రిబ్యూటర్ రూ. 7 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దూకుడు సినిమా తర్వాత విడిపోయి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్... రామ్ చరణ్ సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తుండటం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి.

Ram Charan and Upasana attend a Wedding!

ఈ విషయమై గోపీ మోహన్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం. జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్ నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది. మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మార్చి 5న సినిమా ప్రారంభం కాబోతోంది. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా...తమిళ కుర్రోడు, కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ సినిమాకు అనిరుద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

English summary
Ram Charan & Upasana attended a wedding ceremony in Goa last night. The selfies shot at this high-profile marriage have gone viral now. All those appearing in the pictures were seen in a jubilant mood and its more like a reunion of old friends.
Please Wait while comments are loading...