»   » రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి ఐదేళ్లు.. ఉద్వేగభరితమైన ట్వీట్

రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి ఐదేళ్లు.. ఉద్వేగభరితమైన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి ఐదు ఏళ్లు నిండాయి. తమ ఐదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉపాసన్ ట్విట్టర్‌లో స్పందించారు. మెగా కుటుంబం తనపై కురిపిస్తున్న ప్రేమను ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2012లో రామ్ చరణ్‌, ఉపాసనకు వివాహమైన సంగతి తెలిసిందే.

Ram Charan, Upasana celebrates fifth marriage anniversary

భార్య, భర్తల బంధానికి ఐదేళ్లు నిండాయి. ఆ భావన అద్భుతంగా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల ప్రేమానురాగాల వల్లే మా జీవితం పరిపూర్ణంగా మారింది. మాకు వెన్నంటి ఉన్న ఆత్మీయులకు నా థ్యాంక్స్ అని ఉపాసన ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్నది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కుతున్న చిత్రానికి సుకుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది.

English summary
Ram Charan, Upasana celebrates fifth marriage anniversary today. On this occassion Upasana tweeted that, 5years of mr&mrsC, wouldn't be so amazing without the love & support of family friends & well wishers.Thanks for always being there fr us.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu