»   » రాంచరణ్ దంపతులు మహారుద్రశత చండీ యాగం

రాంచరణ్ దంపతులు మహారుద్రశత చండీ యాగం

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహారుద్ర శత చండీయాగంలో రాంచరణ్, ఉపాసన దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు నిర్వహించిన యాగంలో పాల్గొని పూర్ణ కుంభంతో పూర్తి చేశారు. కాగా, రాంచరణ్‌ను చూడటానికి ఆయన అభిమానులు ఎగబడ్డారు.

వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా దోమకొండలోని గడికోటలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సినీ హీరో రాంచరణ్‌తేజ్ పాల్గొన్నారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో గత పది రోజులుగా మహారుద్ర శతచండీ యాగం కొనసాగుతోంది. గురువారం చండీయాగం ముగింపు కార్యక్రమం, పుర్ణాహుతి నిర్వహించారు.

ramcharan2

రాంచరణ్‌ తేజ్ తన భార్య ఉపాసనతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు వారు పుర్ణాహుతి, మహారుద్ర శత చండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది పండితులు యాగంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గండికోట వారసులైన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావ్, ఆయన భార్య పుష్పమ్మ, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ శోభన, జాతీయ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కామినేని అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

English summary
Ram Charan and his wife Upasana Kamineni participated in Maharudra Sata Chandi Yagam took place at the Domakonda village in Nizamabad district in Telangana.
Please Wait while comments are loading...