»   » ర్యాలీ ఫర్ రివర్: సద్గురును కలిసిన రామ్ చరణ్-ఉపాసన

ర్యాలీ ఫర్ రివర్: సద్గురును కలిసిన రామ్ చరణ్-ఉపాసన

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, ఉపాసన దంపతులు దార్శనిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ పోస్టు చేశారు. 'సద్గురు నివాసంలో ఏదో అద్భుతం ఉంది. పాజిటివిటీలోని శక్తిని నిజంగా నమ్మండి. మన రైతులకు సాయం చేయడానికి 'నదుల కోసం ర్యాలీ'కి (ర్యాలీ ఫర్‌ రివర్‌) మద్దతు తెలుపుతున్నాం' అని ట్వీట్‌ చేశారు.

దేశంలోని నదీ జలాల సంరక్షణ కోసం 'ర్యాలీ ఫర్‌ రివర్‌' కార్యక్రమాన్ని సద్గురు ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు మద్దుతు తెలిపారు. నదుల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Ram Charan-Upasana visits Sadhguru home

చిరంజీవి మద్దతు
'ర్యాలీ ఫర్‌ రివర్‌' మూమెంటుకు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్ర‌క‌టించారు. న‌దులు కాపాడుకోవ‌డంలో ప్ర‌జ‌లంద‌రూ చేతులు కల‌పాల‌ని కోరుతూ ఆయ‌న మాన‌వాళికి పిలుపు ఇచ్చారు. ర్యాలీ ఫ‌ర్ రివ‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు 80009 80009 నెంబ‌ర్ సెల్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ వీడియో మెసేజ్‌లో లో చిరంజీవి ప్ర‌జ‌ల‌ను కోరిన సంగతి తెలిసిందే.

English summary
"sooo amazing having Sadhguru home.truly beilive in the power of positivity. Rally For River support it to help our farmers." Ram Charan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu