»   » ఉపాసన గిఫ్టును...సినిమాలో యూజ్ చేయనున్న చెర్రీ!

ఉపాసన గిఫ్టును...సినిమాలో యూజ్ చేయనున్న చెర్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తన స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడిన తర్వాత అత్తారింటి నుంచి చాలా కానుకలు వచ్చాయి. అందులో ఒకటి ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారు. ఈ కారు ఖరీదు రూ. 2.5 కోట్లపైనే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే...ఈ కారును తన సినిమాలో వాడబోతున్నాడట రామ్ చరణ్.

రామ్ చరణ్, వెంకటేష్ మల్టీ స్టారర్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఓ పాటలో స్పెషల్ లుక్ కోసమే ఈ కారును ఉపయోగించాలని నిర్ణయించారట. ఇప్పటికే చరణ్ ఈకారుతో పాటు పలు ఫోటో షూట్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అత్తారింటి నుంచి పెళ్లి కానుకగా వచ్చిన కారును....ఇలా సినిమా కోసం కమర్షియల్‌గా వాడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చెర్రీ నిర్ణయం..... చిత్ర నిర్మాతలకు లాభం చేకూర్చడానికా? లేక తాను లాభం పొందడానికా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్, వెంకటేష్ సరసన నయనతారను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. కృష్ణ వంశీ మార్కు ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరరెక్కిస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మల్టీ స్టారర్ చిత్రంలో నటించి హిట్ కొట్టారు. మరో వైపు హిందీ మూవీ బోల్ బచ్చన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న 'మసాలా' చిత్రంలో రామ్‌తో కలిసి నటిస్తున్నాడు. చరణ్‌తో చేయబోయే సినిమా వెంకీ మూడో మల్టీ స్టారర్ చిత్రం.

English summary
Ram charan to use his Aston Martin car in Krishna vamsi's movie. Ram Charan and Venkatesh's upcoming multi-starrer, to be directed by Krishna Vamsi, would be launched in November. The director is reportedly putting finishing touches to the script and the shooting likely to commence in December.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu