»   » మహేష్ హిట్ చిత్రం టైప్ కథతో రామ్ చరణ్

మహేష్ హిట్ చిత్రం టైప్ కథతో రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం 'మురారి' . కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం మహేష్ బాబు కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అలాంటి చిత్రమే రామ్ చరణ్ తో తీస్తున్నానంటున్నారు కృష్ణవంశీ. ఆయన మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ప్రారంభం జరిగింది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- 'క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, కుటుంబ భావోద్వేగాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారని, రామ్‌చరణ్ కెరీర్‌లో సరికొత్త పాత్రగా నిలిచే ఈ సినిమాలో కాజల్ మరోసారి ఆయనతో జతకట్టనుందని, ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం 'మగధీర' తరువాత అంత విజయం సాధిస్తుందని తెలిపారు. రాజ్‌కిరణ్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జి ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారని, ఈ షూటింగ్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో, ఆ తరువాత 40 రోజులపాటు రామేశ్వరం, నాగర్‌కోయిల్, పొల్లాచ్చిలో చేస్తామని' అన్నారు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan has joined the sets of his upcoming film in Krishna Vamsi's direction. Kajal is his co-star in this family entertainer and it also stars Srikanth and Kamalinee Mukherjee in important roles. Tamil actor Raj Kiran has been roped in to play a crucial role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu