twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెండి తెరపై వినోదం పంచే.. సినీ తారలు. ఆటవిడుపు కోసం మైదానంలోకి దిగారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌)లోనే. తారల క్రికెట్‌ హంగామా మొదలైంది... సీసీఎల్‌లో మూడో అంకం కోసం. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒకే వేదికపైకి వచ్చి.. వినోదాన్ని మరో రూపంలో పంచడానికి సర్వం సిద్ధమైంది.

    కప్పు కోసం కదన రంగంలోకి దిగడానికి మన తెలుగు జట్టూ సిద్ధమైంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో తెలుగు వారియర్స్‌ పరిచయ కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఈ నెల 9 నుంచి సీసీఎల్‌-3 సందడి మొదలవుతుంది. టీమ్ సభ్యుల్లో కొత్తగా చేరిన రామ్‌చరణ్‌ను వెంకటేష్ ప్రత్యేకంగా పరిచయం చేశారు.

    సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మూడో దఫాలో తలపడనున్న తెలుగు వారియర్స్‌ జట్టుకు వెంకీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ పోటీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 10వ తేదీన బెంగాల్‌ టైగర్స్‌తో మన తెలుగు వారియర్స్‌ జట్టు తలపడబోతోంది. ఈ పోటీ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగిరిలో ఉంటుంది.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కి సంబంధించిన ‘తెలుగు వారియర్స్' పరిచయ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    కొత్తగా హీరో రామ్‌చరణ్‌ జట్టులోకి అడుగుపెట్టారు. కెప్టెన్‌ వెంకటేష్‌ - చరణ్‌ను సాదరంగా ఆహ్వానించారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    టోర్నీలో చరణ్‌ ధరించనున్న 33వ నెంబర్‌గల జెర్సీని అందజేశారు. వెంకటేష్‌ ఒకటో నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా తారలు చెప్పిన విషయాలివీ...

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    ''సీసీఎల్‌ పోటీల్లోకి ఈసారి కొత్త జట్లు ప్రవేశించాయి. ప్రతి ఆట మరింత పోటాపోటీగా ఉండబోతోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాము''అన్నారు వెంకటేష్‌.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    వెంకటేష్ మాట్లాడుతూ - ‘‘సీసీఎల్ సీజన్ 3 కూడా ఆడటం చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఎనిమిది జట్లు సీసీఎల్‌లో తలపడబోతున్నాయి. చాలా టఫ్ కాంపిటీషన్. తప్పకుండా గెలుస్తాం. చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ టీమ్‌లోకి చరణ్ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    రామ్‌చరణ్ మాట్లాడుతూ - ‘‘వెంకీ అంకుల్ గెడైన్స్‌తో ఆడతాను. ఆయన నన్ను ఓపెనర్‌గా కాకుండా ఏడుగురు తర్వాత పంపితే బెటర్. అలా అయితే గెలిచే అవకాశం ఉంటుంది.'' అన్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    ''ఈసారి మైదానంలో మరింత వినోదాన్ని పంచబోతున్నాం. ఆటగాళ్లంతా నిపుణుల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతున్నారు. ఈసారి జట్టులోకి రామ్‌చరణ్‌ రావడం ఆనందంగా ఉంది. గత దఫా మేం చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఆడతాం. ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఈ పోటీలు వివిధ రాష్ట్రాల్లో జరగనున్నాయి. దీంతో ఆయా మైదానాల్ని పరిశీలించి ఆటకు సన్నద్ధమవుతాం. మా జట్టు కోచ్‌ వంకా ప్రతాప్‌, సలహాదారుడు వి.చాముండేశ్వరీనాథ్‌ మంచి సూచనలు ఇస్తున్నారు. ప్రతి జట్టు కూడా కొన్ని ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతుంది. మేం కూడా అందుకు తగ్గట్టుగా ఆడబోతున్నాం''. అన్నారు వెంకీ.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    ''వెంకటేష్‌ జట్టు అంటే అంతా సరదా సరదాగా ఉంటుంది. ఆయన ఆటగాళ్లతో మసలుకొనే విధానం అలా ఉంటుంది. వెంకీ అంకుల్‌ మార్గనిర్దేశనంపైనే నా ఆట ఆధారపడి ఉంటుంది. నన్ను బ్యాటింగ్‌కి ఏడు లేదా ఎనిమిదో స్థానంలో పంపిస్తే బాగుంటుంది. జట్టు కూడా సురక్షితంగా ఉంటుంది (నవ్వుతూ). సీసీఎల్‌ చిన్నగా మొదలై జాతీయస్థాయికి చేరుకొంది. ఈసారి మరింత ఆదరణ పొందుతుందనే నమ్మకముంది. సినిమాలతో వినోదాన్ని పంచిన మేమంతా ఇకపై ఆటతో అలరిస్తాం'' అన్నారు చరణ్.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    తెలుగు వారియర్స్‌ జట్టుకు సలహాదారుగా వ్యవహరిస్తున్న చాముండేశ్వరినాథ్‌ మాట్లాడుతూ ''ఆటగాళ్ల మంచి క్రీడాస్ఫూర్తితో ఉన్నారు. తప్పకుండా మంచి ఆట తీరును కనబరుస్తారనే నమ్మకముంది. తరుణ్‌లాంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నార''న్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    ఈ సమావేశంలో జట్టు సభ్యులతో పాటు కోచ్ వంకా ప్రతాప్, సీసీఎల్ మెంటర్ చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    సీసీఎల్‌ నిర్వాహకుడు విష్ణు ఇందూరి మాట్లాడుతూ ''9వ తేదీన కేరళలోని కొచ్చిలో ప్రారంభ వేడుక సందడిగా మొదలవుతుంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌... ఇలా అన్ని భాషల తారలూ అక్కడికి చేరుకొంటారు. ఆ వేడుకలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాలు కనువిందు చేస్తాయి'' అన్నారు.

    సీసీఎల్‌ డైరెక్టర్‌, తెలుగు వారియర్స్‌ జట్టు సహ యజమాని తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ''సీసీఎల్‌ టోర్నీ ఆలోచన హైదరాబాద్‌లోనే పుట్టింది. 2001లో ఆరంభమైన టాలీవుడ్‌ టోర్నీ నుంచి ఇలా జాతీయస్థాయికి చేరింది. హీరోలంతా తమ స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి ఆడుతున్నారు. మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోంది. మరాఠీ, భోజ్‌పురి జట్లతో కలుపుకొని మొత్తం ఎనిమిది జట్లు ఆటలో పాల్గొనబోతున్నాయి''అన్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    తెలుగు వారియర్స్‌ జట్టులో శ్రీకాంత్‌, తరుణ్‌, నితిన్‌, రఘు, అజయ్‌, నిఖిల్‌, కార్తీక్‌, సామ్రాట్‌, ప్రిన్స్‌, నందకిశోర్‌, విశ్వ, హర్ష, సన్నీ, తేజ, గిరి, ఆదిత్య తదితరులు ఆడబోతున్నారు.

    వెంకీ... నెంబర్ 1,రామ్ చరణ్‌... నెంబర్ 33(ఫోటోలు)

    ఈ జట్టుకి ప్రచారకర్తలుగా కథానాయికలు ఛార్మి, రిచా గంగోపాధ్యాయ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో వంకా ప్రతాప్‌, సీసీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Celebrity Cricket League (CCL) 3 – 2013 is all set to take place from 9th February to 12th March. This time, 8 teams with film stars from 8 Indian film industries will play this tournament, called T20 cricket tournament. As usual Victory Venkatesh will represent the Telugu Warriors as the team captain. Interestingly, this time the team includes one more star. He is none other than Ram Charan, who’s riding high with the success of his recently released ‘Naayak’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X