Just In
- 20 min ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 54 min ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 1 hr ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
- 2 hrs ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ క్రికెట్లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షం
- News
దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జిమ్ సెంటర్‌లో వాదనకు దిగిన రామ్ చరణ్.. వీడియో వైరల్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు పిల్లలను ఆట పట్టించడం అంటే ఎంత సరదానే అందరికీ తెలిసిందే. పిల్లలనే కాదు తన మనసుకు దగ్గరైన వారిని చాలా ఆడేసుకుంటాడని టాక్. చరణ్ సోదరిమణులైన సుష్మిత, శ్రీజలను కూడా అలానే ఏడిపిస్తాడని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. శ్రీజ వివాహా వేడుకల్లో, ఈ మధ్యే జరిగిన పుట్టిన రోజు ఈవెంట్‌లో చెర్రీ ఏవిధంగా ఏడ్పించాడో అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్..
ఒకప్పుడు రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. ఉపాసనను ఫాలో అయ్యేవారు మెగాభిమానులు. రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరయ్యాక.. ఫుల్ యాక్టివ్ అయిపోయిడు. ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్ డేట్స్‌తో పాటు పర్సనల్ విషయాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు.

ఫిట్‌నెస్ కోసం కసరత్తులు..
ఆర్ఆర్ఆర్ కోసం ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తూ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు కావాల్సిన రీతిలో తన శరీరాకృతిని మార్చుకునేందుకు వ్యాయామశాలలో కష్ట పడిపోతున్నాడు. అయితే అలాంటి సమయంలో ఓ బుడ్డోడితో వాదనకు దిగి అందర్నీ నవ్వించేశాడు చరణ్.

పిల్లలంటే తెగ ఇష్టపడే చరణ్..
రామ్ చరణ్‌కు పిల్లలంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా చాలా సినిమాల షూటింగ్స్ అప్పుడు చిన్న పిల్లలతో ఆడుకుంటూ వీడియోలు కనిపించాయి. ఇప్పుడు కూడా ఇదే చేసాడు మెగా వారసుడు. జిమ్ సెంటర్‌లో ఓ పిల్లాడితో వాదనకు దిగి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
|
వాదించిన చరణ్..
అక్కడున్న బుడ్డోన్ని ఈ మధ్య నువ్వు ఏ సినిమా చూసావ్ అని అడిగాడు చరణ్. దానికి ధృవ అంటూ సమాధానమిచ్చాడు ఆ బుడ్డోడు. అయితే నటించింది తాను కాదని తన ఫాదర్ అని చెప్పగా.. కాదు నువ్వే అంటూ ఆ బుడ్డోడు సమాధానమిచ్చాడు. కాదు నువ్వు అంటూ చరణ్.. కాదు నవ్వే అంటూ ఆ బుడ్డోడు వాదించుకున్నారు.

పిల్లోడితో సందేశం..
ఇక చివరకు పిల్లోడిని దగ్గరకు తీసుకుని జిమ్‌కు వెళ్లండి ఆరోగ్యంగా ఉండంటూ అనే ఓ సందేశాన్ని చెప్పించాడు. జిమ్ బడ్డీస్.. అంటూ ఈ ఫన్నీ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగానే వైరల్ అవుతుంది.

కీలక పాత్రల ప్రకటన..
ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన అప్ డేట్స్ ప్రకటించేశాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తుండగా.. మెయిన్ విలన్‌లుగా రే స్టీవెన్ సన్, ఎలిసన్ డూడీ నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.