»   » తోపులాట, రాంచరణ్‌ చొక్కా చిరిగిపోయింది

తోపులాట, రాంచరణ్‌ చొక్కా చిరిగిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
అరసువెల్లి: అరసువెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సినీ హీరో రాంచరణ్‌ తేజ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒకటో పట్టణ ఎస్సై కె.భాస్కరరావు కిందపడిపోయారు. రాంచరణ్‌ తేజ వేసుకున్న చొక్కా చిరిగిపోయింది.

వివరాల్లోకి వెళితే.. రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన సోమవారం అరసవల్లిలో సందడి చేశారు. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణస్వామివారి దర్శనానికి వారు వస్తున్నట్టు తెలుసుకున్న అభిమానులు పెద్ద సం ఖ్యలో తరలిరావటంతో అరసవల్లి జనసంద్రంగా మారింది. అభిమానుల కేరిం తలతో ఆలయ పరిసరాలు దద్దరిల్లాయి. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకోవటంతో పోలీసు లు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.


తొలుత ఆల య అధికారులు, అర్చకులు రామ్‌చరణ్ దంపతులకు స్వాగ తం పలికారు. అనంతరం ఆదిత్యుడిని దర్శిం చుకున్న రామ్‌చరణ్, ఉపాసనలు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అనివెట్టి మం డపంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ అందజేశారు. ఆలయ అధికారి ఆర్.పుష్పనాథం, ట్రస్ట్‌బోర్డు సభ్యుడు పసగడ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మెట్ట నాగరాజు, మండవల్లి రవి, తైక్వాండో శ్రీను తదితరులు పాల్గొన్నారు.


ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ...ఎవడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామ్‌ చరణ్‌, వంశీపైడిపల్లి కాంబినేషన్‌ లో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'ఎవడు'. ఇటీవలే స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబద్ చేరుకుంది చిత్ర యూనిట్. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎవడు చిత్రాన్ని జులై 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary

 Ramcharan visited Arasavelli yesterday. Many Fans gathered at that place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu