రంగస్థలం తర్వాత.. రాంచరణ్ దృష్టి అక్కడ.. ఆయనకు నేను వీరఫ్యాన్‌ను!

By Rajababu

Recommended Video

Ram Charan Wish To Make A Movie In Bollywood

రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ దృష్టి బాలీవుడ్‌పై పడింది. ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ చిత్ర రీమేక్‌తో రాంచరణ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొన్నేళ్లుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి పలు విషయాలు వెల్లడించారు.

మరోసారి బాలీవుడ్‌పై దృష్టి

మరోసారి బాలీవుడ్‌పై దృష్టి

దక్షిణాది హీరోల దృష్టి ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమపై పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కార్వాన్ అనే చిత్రంతో హిందీలోకి ప్రవేశిస్తున్నారు. ఇక మరోసారి రాంచరణ్ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆయనకు నేను వీరఫ్యాన్‌ను

ఆయనకు నేను వీరఫ్యాన్‌ను

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరాణి‌కు వీర ఫ్యాన్‌ను. ఆయనతో పనిచేయాలని ఉంది. కమర్షియల్, ఆర్ట్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయనకు ఎదురులేదు. అలాంటి దర్శకుడితో పనిచేయాలని ఉంది అని రాంచరణ్ అన్నారు.

విశాల్ భరద్వాజ్ అంటే నాకు ఇష్టం

విశాల్ భరద్వాజ్ అంటే నాకు ఇష్టం

అలాగే నాకు దర్శకుడు విశాల్ భరద్వాజ్ అంటే కూడా ఇష్టం. అతను రూపొందించిన చిత్రాలంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. గతంలో జంజీర్ చిత్రంలో నటించాను. కానీ అది సరిగా ఆడలేదు. మరోసారి బాలీవుడ్‌లో నటించాలని ఆసక్తి కలుగుతున్నది. ట్రై చేస్తే తప్పేముంది అని రాంచరణ్ పేర్కొన్నారు.

మంచి స్టోరి లభిస్తే

మంచి స్టోరి లభిస్తే

బాలీవుడ్‌లో మంచి దర్శకుడు, కథ, ప్రొడక్షన్‌తో కూడిన ప్రాజెక్ట్ లభిస్తే నేను నటించడానికి సిద్ధం. నాకున్న మార్కెట్‌ను బట్టి ఈసారి ప్రయత్నిస్తాను అని రాంచరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంచి కథ దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్దం అని అన్నారు.

హీరోయిన్ ఎవరైనా సరే..

హీరోయిన్ ఎవరైనా సరే..

కథను బట్టి బాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌తోనైనా నటిస్తాను. కానీ కథ డిమాండ్ చేయాలి. ప్రతీ ఒక్కరు గొప్ప సినిమాలు చేస్తున్నారు. మెరుగైన నటన ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా ఫలానా హీరోయిన్ అని రిజర్వేషన్స్ ఏమీ లేవు అని చెర్రీ వెల్లడించారు. గతంలో జంజీర్‌లో ప్రియాంక చోప్రాతో జతకట్టిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X