»   » పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవర్ స్టార్ వస్తున్నారా? అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఆయన్ను కలవడానికి ఇవాళ వెలుతున్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను. పిలవడానికి ఆయన చిన్న పిల్లాడు కాదు. ఇన్విటేషన్ ఇవ్వడమే మన బాధ్యత. రావాలా, వద్దా అనేది ఆయనే డిసైడ్ చేసుకుంటారు... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

'ఖైదీ నుం 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్ నేపథ్యంలో మంగళవారం రామ్ చరణ్ అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు.

అన్నయ్యకు ఫ్యాన్స్ అంతా కలిసి గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతున్నాం...మీరు కూడా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారా... అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఎక్కడా తగ్గకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్, సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి మీడియాతో నాన్నగారు ఇంటరాక్ట్ అవుతారు అన్నారు.

ట్రైలర్ 7న

ట్రైలర్ 7న

ట్రైలర్ జనవరి 7న విడుదల చేయబోతున్నాం. ఈ రోజే చూసాను. చాలా బాగా వచ్చింది. చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అన్నారు.

ప్రస్తుతం తెలుగులోనే

ప్రస్తుతం తెలుగులోనే

ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలేమీ చేయడం లేదు. ప్రస్తుతానికి మూడు తెలుగు ప్రాజెక్టులే సైన్ చేసాను. ఆ మూడు చేసిన తర్వాతే ఏదైనా ఆలోచిస్తాను అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ స్పందించారు.

మహేష్ తో సిద్ధమే

మహేష్ తో సిద్ధమే

మంచి సబ్జెక్టు ఉంటే మహేష్ బాబుతో గానీ ఇంకెవరితో అయినా చేయడానికి సిద్ధమే. సబ్జెక్ట్ చాలా ముఖ్యం అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

దాసరి, రాఘవేంద్రరావు

దాసరి, రాఘవేంద్రరావు

ఖైదీ నెం 150 చిత్రానికి ముఖ్య అతిథిగా దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు వస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. దీంతో పాటు ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, నిర్మాతలు వస్తున్నారని తెలిపారు.

నాన్నతో నటించడం డ్రీమ్

నాన్నతో నటించడం డ్రీమ్

ఖైదీలో చిన్న 30 సెకన్స్ రోల్ చేసాను. మంచి సబ్జెక్ట్ దొరికితే తప్పకుండా నాన్నగారితో చేస్తాను. ఆయనతో చేయాలనేది నా డ్రీమ్ అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

బాలయ్య గారికి ఆల్ ది బెస్ట్

బాలయ్య గారికి ఆల్ ది బెస్ట్

సంక్రాంతికి సినిమాలు క్లాష్ అవ్వడం మామూలు. గతంలో నాకు, మహేష్ కు సినిమా క్లాష్ వచ్చింది. కానీ రెండు బాగా ఆడాయి. క్రిష్ అండ్ బాలయ్య గారికి ఆల్ ది బెస్ట్. నా టీంకు కూడా ఆల్ ది బెస్ట్ అని రామ్ చరణ్ తెలిపారు.

శాతకర్ణితో వద్దని నాన్న చెప్పారు, ఇండస్ట్రికి మంచిది కాదనే రిలీజ్ మార్పు: రామ్ చరణ్

శాతకర్ణితో వద్దని నాన్న చెప్పారు, ఇండస్ట్రికి మంచిది కాదనే రిలీజ్ మార్పు: రామ్ చరణ్

ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకేరోజున రావ‌డం ఇండ‌స్ట్రీకి అంత మంచి ప‌రిణామం కాద‌ని నాన్న‌గారు చెప్ప‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నామని తెలిపారు.

English summary
Ram Chran live chat for Khaidi No 150, Check out details. Khaidi No. 150 is an upcoming Indian Telugu-language action drama film directed by V. V. Vinayak, and written by AR Murugadoss.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu