For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వర్మ వర్ణించిన తీరు అద్భుతం... ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్ రివ్యూ

  By Bojja Kumar
  |

  ఇండియాలోని మెస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ దర్శకత్వంలో గతంలో కొన్ని పిచ్చి సినిమాలు వచ్చినప్పటికీ ఆయన నుండి వచ్చిన కొన్ని అద్భుతమైన సినిమాల గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. ఆయన మనసు పెట్టి చేస్తే సినిమా ఎంత అద్భుతంగా, రియాల్టీ ఉట్టి పడేలా, ప్రేక్షకులు ఊహించని ఒక కొత్త కోణం తెరపై ఆవిష్కరిస్తారో చెప్పడానికి ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

  తొలిసారిగా సెక్స్ సబ్జెక్టును టచ్ చేసిన వర్మ

  తొలిసారిగా సెక్స్ సబ్జెక్టును టచ్ చేసిన వర్మ

  ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ టచ్ చేయిన అంశం శృంగారం. పూర్తిగా సెక్స్ బేస్డ్ ఫిల్మ్ ఆయన నుండి రాలేదు. భారతీయ సమాజంలో సెక్స్ అనే దాన్ని ఇప్పటికీ ఒక బూతుగానే చూస్తారు. మనిషి జీవితంలో ప్రధానమైన అంశాల్లో ఇదీ ఒకటైనప్పటికీ విపరీత కట్టుబాట్ల సమాజం ఒక పద్దతి ప్రకారం ఈ ప్రకృతి పరమైన ఈ చర్యను అణచిపెట్టింది. మరిలాంటి సెక్స్ గురించి ఒక తాత్విక ధోరణిలో వర్ణిస్తూ వర్మ తీసిన ఫిల్మ్ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్'.

  మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
  కీరవాణి కూడా చేతులు కలిపారంటే...

  కీరవాణి కూడా చేతులు కలిపారంటే...

  తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ పరిశ్రమలోనే సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎంఎం కీరవాణి ఒకరు. సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని బాషాల్లో సంగీతం అందించారు. ఇంతటి అనుభవం ఉన్న కీరవాణి.... వర్మతో కలిసి శృంగార చిత్రానికి సంగీతం అందించారంటే ఇందులో విషయం ఉందని అర్థం చేసుకోవచ్చు.

  చాలెంజ్‌గా తీసుకున్న వర్మ

  చాలెంజ్‌గా తీసుకున్న వర్మ

  శృంగారంలో ముఖ్యభూమిక స్త్రీదే. అందుకే కవులు శృంగారానికి ప్రతికగా స్త్రీని పోలుస్తారు. ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చనే విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని వర్మ ఈ ప్రయత్నం చేశారు.

  శృంగార ఘాడతను కూడా ఆధ్యాత్మిక కోణంలో

  శృంగార ఘాడతను కూడా ఆధ్యాత్మిక కోణంలో

  తాను ఎంచుకున్న సెక్స్ సబ్జెక్టును తెరపై ఆవిష్కరించడానికి అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎంచుకున్న వర్మ... నా కెమెరా కన్ను ఆమె సుందర నగ్న శరీరంలోని అంగాగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గుడతని, ఆమెలోని నిక్షిప్తమై ఉన్న ఒక శృంగార ఘాడతను కూడా ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది అని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  ముఖ్య ఉద్దేశ్యం అదే

  ముఖ్య ఉద్దేశ్యం అదే

  విపరీత కట్టుబాట్ల సమాజం ఒక పద్దతి ప్రకారం అణచిపెట్టబడిన ప్రకృతి పరమైన స్వేచ్ఛ ఆలోచనలను బహిరంగ పరచడమే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  మానసిక, శారీరక స్వేచ్ఛ కోరుకును స్త్రీల కోసం

  మానసిక, శారీరక స్వేచ్ఛ కోరుకును స్త్రీల కోసం

  జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మగాడు తనపై చూపే శృంగార మయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలి పోవాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ప్రాజెక్ట్ ఒక ప్రతినిధి...అని చెప్పే ప్రయత్నం చేశారు.

  వాటిని అధిగమించడాని మహోన్నత సాధనం

  వాటిని అధిగమించడాని మహోన్నత సాధనం

  సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలను, బలవంతపు బంధాలను, కుహానా నైతిక విలువలను అధిగమించడానికి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనేది ఒక మహోన్నత సాధనం.... అని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  జీవితంలో ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి

  జీవితంలో ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి

  అప్పటి వరకు ఉన్న ఆలోచనలకు అవతల ఏముందని ఆలోచించినపుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితంలో ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహద పడుతుంది. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ఫిల్మ్ ద్వారా అలాంటి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు వర్మ.

  శృంగారంలో నాణ్యతను పెంచేలా కీరవాణి సంగీతం

  శృంగారంలో నాణ్యతను పెంచేలా కీరవాణి సంగీతం

  కీరవాణి అందించిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావ ప్రకటనలోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తి వంతంగా వ్యక్త పరచడానికి దోహద పడుతుంది. సాధారణ స్వర కల్పనలకు అందరి మహాద్భుతమైన బాహుబలికి ఆధ్యాత్మికతను నిలువెల్లా నింపుకున్న అన్నమయ్యకూ సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్ విషయంలో కూడా అంతే నిబద్ధతను చూపడం మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వడం నన్ను అబ్బుర పరిచింది.... అంటూ వర్మ పొగడ్తలతో ముంచెత్తారు.

  సెక్స్ ను పవిత్రంగా చూడాలి, సిగ్గు, అపరాధ భావం ఉండకూడదని

  సెక్స్ ను పవిత్రంగా చూడాలి, సిగ్గు, అపరాధ భావం ఉండకూడదని

  మియా మాల్కోవా తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం. తనకు తోచిన విధంగా సెక్స్ ఎంజాయ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం. అంతే కాకుండా సెక్స్ ను పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధ భావం ఉండకూడదని చెప్పే తన ఆలోచనకు ఉన్న లోతుల్ని కూడా చూడగలగటం.... తనకు ఎంతో నచ్చిందని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  అలెగ్జాండర్ కంటే బలమైనది

  అలెగ్జాండర్ కంటే బలమైనది

  మియాలోని అందం మరియు తాత్వికత నిజాయితీ కలగలిపిన మాటల మూలాన సెక్స్ లోని అన్నీ అంశాలు కళ్లు మొదడు ఉన్న ఎవరికైనా స్వచ్ఛంగా, అందంగా, పవిత్రంగా కనిపిస్తాయి. మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది. ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిప్పోక్రిటికల్ మానవ సమాజంపై ధ్వజమెత్తి జయించడానికి నడుం కట్టుకుంది..... అని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  చారిటీ క్వీన్

  చారిటీ క్వీన్

  ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకు ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకే ఆమె ఆలోచలను అర్ధం చేసుకునే బుర్ర ఉన్న ప్రతిఒక్కరూ ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ కొడతారు. పేరుకు పోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్నస్త్రీ నుండి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడే ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వెనక ఉన్న ఒక తాత్వికత..... అని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

  English summary
  Ram Gopal Varma about Mia Malkova's God Sex Truth. God, Sex and Truth, the latest offering by Ram Gopal Varma, is about sex. Yes, it's about sex, and about how great sex is. Did I mention it's about sex? Well, it's about sex, and it stars American porn star Mia Malkova. The trailer of the movie was launched on Tuesday, and you see Malkova be as comfortable as one can be in their own skin.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more