For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV: రామ్ గోపాల్ వర్మ రాజకీయ 'వ్యూహం'.. బయోపిక్ కాదు, లోతైనా రియల్ పిక్ అంటూ..

  |

  రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ కింగ్ గా పేరు పొందాడు. అలాగే నిజ జీవితపు సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తూ సంచలనాలకు నెలవుగా మారారు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్‌టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, మర్డర్, వంగవీటి చిత్రాలను తెరకెక్కంచిన ఆయన తాజాగా మరో బయోపిక్ తీయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అది బయోపిక్ కాదు.. రియల్ పిక్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళితే..

  ఒకరిని ఇబ్బంది పెడుతూనే..

  రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ గానీ, కామెంట్ గానీ, సినిమా గానీ.. ఏదైతే ఏంటీ.. దానితో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. ఎవరివో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇక ఆయన తనకు నచ్చి విధంగా సినిమాలు చేస్తారన్న విషయంత తెలిసిందే. ఇటీవల డేంజరస్, లడ్కీ వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన బయోపిక్ చిత్రాలు కూడా చాలానే తీశారు. ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయిన ఆర్జీవీ తాను ఎలాంటి సినిమాను తీయనున్నారో ప్రకటించారు.

  లోతైన రియల్ పిక్...

  ఆర్జీవీ తను తర్వాత తెరకెక్కించే సినిమాకు వ్యూహం అని టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి పలు ట్వీట్ లు చేశారు. ''నేను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అబద్ధాలు ఉండొచ్చు.. కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి''. ''అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే వ్యూహం చిత్రం''.

  షాక్ నుంచి తేరుకునేలోపే..

  ''ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది. మొదటి పార్ట్ వ్యూహం.. రెండో పార్ట్ శపథం. రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపే వాళ్లకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్.. పార్ట్ 2 శపథంలో తగులుతుంది''. ''వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు. కనుక, ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనుక చెప్పట్లేదు'' అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ.

  పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ..

  అయితే ఏపీ సీఎం జగన్ తో రామ్ గోపాల్ వర్మ మీటింగ్ అయిన వెంటనే ఆయన నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు రూపుదిద్దుకుంటాయన్న ప్రచారం జరిగింది. రెండు సినిమాలను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇతరులతో తెరకెక్కిస్తారని, జగన్ బయోపిక్ మాత్రం ఆర్జీవే స్వయంగా దర్శకత్వం వహిస్తారని టాక్. ఇందులో జగన్ కు ఎలివేషన్లు ఇచ్చేలా ఉంటుందని సమాచారం. ఇప్పుడు బయోపిక్ కాదు.. రియల్ పిక్ అని ఆర్జీవీ చేసిన ట్వీట్ తో ఇది జగన్ బయోపిక్ ను తీస్తున్నట్లుగా చెప్పకనే చెబుతున్నారని అనుకుంటున్నారు.

  English summary
  Sensational Director Ram Gopal Varma Announces His New Biopic Movie On Andhra Pradesh CM Jagan Mohan Reddy And Titled As Vyuham
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X