twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదంతా అవాస్తవం.. మీడియా వార్తలన్నీ గాలి కబుర్లే.. నాగార్జున సినిమాపై వర్మ ఎమోషనల్

    టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన చిత్రం శివ. తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే శివ సినిమాకు ముందు..

    By Rajababu
    |

    టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన చిత్రం శివ. తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే శివ సినిమాకు ముందు.. శివ చిత్రానికి తర్వాత అనేంతగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ సినిమాను రూపొందించారు. అంతటి ఘనత కలిగిన చిత్రాన్ని తీసేందుకు రాంగోపాల్ వర్మకు భరోసానిచ్చిన నాగార్జున విజన్‌ను అభినందించాల్సిందే. తనకు దర్శకుడిగా అవకాశం కల్పించిన నాగార్జున గురించి తలుచుకొని సోషల్ మీడియాలో వర్మ ఉద్వేగానికి గురైన విధం మీరే చూడండి...

    Recommended Video

    RGV- Nagarjuna New Film Details "శివ" కాంబో మళ్ళీ రిపీట్
    శివ ప్రారంభమైన చోటనే..

    శివ ప్రారంభమైన చోటనే..

    శివ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో గోవిందా గోవిందా, అంతం చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఆ తర్వాత ఎందుకో వారిద్దరి కాంబినేషన్ కుదర్లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా తీసేందుకు వర్మ సిద్ధమయ్యాడు. ఈ చిత్రం నవంబర్ 20న ఎక్కడైతే అంటే అన్నపూర్ణ స్టూడియోలో శివ ప్రారంభమైందో అక్కడే నాగార్జున నూతన చిత్రం ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని వర్మ అధికారికంగా ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.

     శివ సినిమాకు సీక్వెల్

    శివ సినిమాకు సీక్వెల్

    25 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా తీస్తున్నానని చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది. శివ చిత్రానికి సీక్వెల్ అని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఈ చిత్రం శివ పాత్రకుగానీ, కథకు గానీ సంబంధం లేదు అని ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశారు.

     నాగార్జునతో చాలా డిఫరెంట్

    నాగార్జునతో చాలా డిఫరెంట్

    నాగార్జునతో తీయబోయే సినిమా చాలా కొత్తరకమైన కథ. నాగార్జున ఇంతకుముందు ఎన్నడూ నటించని పాత్ర. మీరు అలాంటి పాత్రలో నాగ్‌ను కూడా చూసి ఉండరు. నాకు శివతో దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన నాగార్జున, ఆదరించిన ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉంటుంది అని వర్మ పేర్కొన్నారు.

     వచ్చే ఏడాది ఏప్రిల్‌లో

    వచ్చే ఏడాది ఏప్రిల్‌లో

    వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రంలో నటించే వారి ఎంపిక పూర్తి కాలేదు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తాను. ఈ చిత్రం నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతుంది అనే ప్రచారం జరుగుతున్నది.

    ఆ తర్వాతే ఎన్టీఆర్ బయోపిక్

    ఆ తర్వాతే ఎన్టీఆర్ బయోపిక్

    నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించి రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌లో సంచలనం రేపాడు. ప్రస్తుతం ఆ చిత్ర కథపై వర్మ టీమ్ కసరత్తు చేస్తున్నది. నాగార్జునతో సినిమా పూర్తయిన తర్వాతనే ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కె అవకాశం ఉంది.

    English summary
    Filmmaker Ram Gopal Varma on Tuesday announced that his next yet-untitled project with actor Akkineni Nagarjuna will start from rolling November 20. In a Facebook post, he said he’s emotional about the project as the first shot will be canned in the same place in Annapurna Studios where his cult film Shiva was shot. “I am extremely excited that I am doing a film with Nagarjuna after nearly 25 years but contrary to some uninformed media speculations, this new film is nothing to do with ‘Shiva’, neither in character nor in story content,” Varma had posted on his Facebook page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X