Don't Miss!
- News
నా గోస ఎవరికీ రావొద్దురో అయ్యో! అయ్యప్ప: నవ్వులు పూయిస్తున్న బుడ్డోడి వీడియో
- Lifestyle
ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగండి! దాని ఫలితం అద్భుతం!!
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
RGV: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్.. హలో పవన్ కల్యాణ్ గారూ మీ దురదృష్టం అంటూ!
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన ఎక్కువగా మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా చెప్పుకుంటూ పలు కామెంట్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు ఆయనకు ఎప్పుడు ట్వీట్ వార్ జరుగుతుంటుంది. ఇటీవల ఆర్జీవీపై నాగబాబు విమర్శలు చేశారు. అందుకు తాజాగా రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.

ఎవరికీ దక్కని విధంగా..
టాలీవుడ్‌లో గొప్ప గొప్ప చిత్రాలు చేసి అతి తక్కువ కాలంలో దేశంలోనే క్రేజీ అండ్ విభిన్న దర్శకుడిగా పేరు సంపాదించాడు సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని రకంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే, కొంత కాలంగా ఆయన ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిలతో రచ్చ చేసే విధానంతో పాటు ట్వీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి.

హీరోయిన్లకు ప్రాధాన్యత..
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేయగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చాడు.

రియాక్షన్స్, కౌంటర్స్..
ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా ఆయన రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయిలతో ఆర్జీవీ ప్రవర్తించే తీరు మాత్రమే కాకుండా ట్వీట్లు సైతం ఆశ్చర్యకరంగా, వివాదాస్పదకరంగా ఉంటున్నాయి. అయితే ఆయన ట్వీట్లు, కామెంట్లపై దానికి సంబంధించిన వ్యక్తులు రియాక్ట్ అవ్వడం.. వాటికి రామ్ గోపాల్ వర్మ మళ్లీ కౌంటర్లు ఇవ్వడం సాధారణంగా కొనసాగుతూనే ఉంటుంది.

ఆర్జీవీ చేసే కామెంట్స్ పై..
మొన్నటితాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ట్వీట్లతో మినీ యుద్ధమే ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన మెగా బ్రదర్ నాగబాబుపై కామెంట్స్ సంధించాడు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసే కామెంట్స్ గురించి ఓ రిపోర్టర్ నాగబాబుని ప్రశ్నించగా ఆయన ఘాటుగా స్పందించారు. ఆర్జీవీ అనే వాడు ఒక బుద్ధిలేని ఎధవ అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ దురదృష్టం..
తాజాగా నాగబాబు వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందిస్తూ ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు. అందులో "కొణిదెల నాగబాబు గారూ.. ఆయన తమ్ముడికి.. ఆయన అన్నయ్యకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కానీ, నాకు కాదు. నేను జనసేన మీద గానీ, పవన్ కల్యాణ్ మీద గానీ చేసిన ట్వీట్లు.. పవన్ కల్యాణ్ అభిమానిగా చేశాను. అది అర్థం అవ్వకపోవడం.. నా దురదృష్టం.. నాకన్న ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టం. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి.. ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే.. దాని తర్వాత పవన్ కల్యాణ్ ఔట్ కమ్ అనేది జనమే చెబుతారు"0 అని మాట్లాడారు ఆర్జీవీ.
|
విన్నాక స్పందిస్తా..
ఈ వీడియోను షేర్ చేస్తూ హల్లో పవన్ కల్యాణ్ గారూ..కొంచెం మీ భాయిజాన్ గారిని చూసుకోండి అని క్యాప్షన్ రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. కాగా సంక్రాంతి సందర్భంగా ఆర్జీవీ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం మీడియాలో మాట్లాడుతూ తన గురించి నాగబాబు ఏం మాట్లాడారో తెలియదని.. దాని గురించి వినలేదని, విన్నాక స్పందిస్తానని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. ఇందులో భాగంగానే తాజాగా వీడియో ద్వారా స్పందించారు.