twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Legend singer పట్టపగలే దారుణ హత్య.. 20 బుల్లెట్లు దేహంలోకి.. రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

    |

    ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూస్‌వాలా దారుణ హత్య దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నది. సిద్దూ మరణ వార్తతో సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతునున్నారు. ఆయన హత్యా వార్త సినీ వర్గాల్లో భయాందోళనలు రేపుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు రాంగోపాల్ వర్మ లాంటి తెలుగు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో సిద్దూ మూస్‌వాలా హత్యను ఖండిస్తున్నారు. సిద్దూ మూస్‌వాలా వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం, ప్రముఖుల సంతాపం గురించిన వివరాల్లోకి వెళితే..

     సింగర్, ర్యాపర్‌, యాక్టర్‌గా

    సింగర్, ర్యాపర్‌, యాక్టర్‌గా


    సిద్దూ మూస్‌వాలా భారతీయ వినోద పరిశ్రమలో గాయకుడిగా, ర్యాపర్‌గా, నటుడిగా అందరికి సుపరిచితులు. పంజాబీ సినిమా, పంజాబీ మ్యూజిక్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. గేయ రచయితగా కెరీర్‌ను ఆరంభించి.. లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత జీ వ్యాగన్ అనే పాటతో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు.

    పంజాబ్ మ్యూజిక్ సంచలనం

    పంజాబ్ మ్యూజిక్ సంచలనం


    సిద్దూ మూస్‌వాలా కెరీర్ విషయానికి వస్తే.. లెజెండ్, డెవిల్, జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్ట్ జాట్ దా ముకాబలా, బ్రౌన్ బాయ్స్, హత్యార్ లాంటి సూపర్ హిట్ పాటలను అందించారు. ఆయన పాడిన చివరి పాట ది లాస్ట్ రైడ్. గేయ రచయితగా, గాయకుడిగా పంజాబ్ సినిమా, మ్యూజిక్ రంగంలో విశేషంగా రాణించారు.

     కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ

    కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ


    సిక్కు మతం ఆయుధాలు ఉపయోగం, గన్ కల్చర్ గురించి పాటలు రాసి, పాడటం ద్వారా వివాదంలో కూరుకుపోయారు. గన్ కల్చర్ ప్రమోట్ చేస్తున్నారంటూ 4 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల కాలంలో ఆయనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

    Recommended Video

    Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
    సెక్యూరిటీ తొలగించిన మరుసటి రోజే

    సెక్యూరిటీ తొలగించిన మరుసటి రోజే


    ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో సిద్దూ మూస్ వాలాకు ఉన్న సెక్యూరిటీని రద్దు చేయడం వివాదస్పదమైంది. సెక్యూరిటీ తొలగించిన మరుసటి రోజే ఆయన దారుణ హత్యకు గురికావడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఆయనపై 20 రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

    సామాన్యుల పరిస్థితి ఏంటి?


    సిద్దూ మూస్‌వాలా హత్య గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎమోషనల్ అయ్యారు. 1997లో పటపగలే టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య తర్వాత అంతటి ఘోరంగా సిద్దూ మూస్‌వాలా హత్య జరిగింది. కోట్లాది మంది దేవుడిగా కొలిచే సినీ ప్రముఖుడికే ఇలా జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని రాంగోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Popular director and producer Ram Gopal Varma emotional on Sidhu Moose Wala murder at Mansa of Punjab state. RGV Tweeted that Not since the brazen GulshanKumar ‘s broad daylight murder in 1997 ,a murder as brutal as that of SidhuMosseWala happened ..If this can happen to a celebrity with crores of followers god also can’t save the common people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X