నివురు గప్పిన నిప్పులా వర్మ, నట్టి కుమార్ వివాదం.. 6 కేసులతో ఆర్జీవి భారీ ప్లాన్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్నదనే సమాచారాన్ని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్‌ ఎత్తులకు పైఎత్తు వేసే విధంగా ఆర్జీవి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. కేవలం న్యాయ నిపుణులతోపాటు రాజకీయ నేతలతో కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న నట్టి క్రాంతి, నట్టి కరుణ, నట్టి కుమార్‌పై ఏకంగా ఏడు కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

1. చట్టపరిధిలోకి వచ్చే ఏ ప్రాంతంలో కూడా డేంజరస్ సినిమా విడుదల కాకుండా
అడ్డుకోకుండా తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జిని నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొనే విధంగా పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో వర్మ ఉన్నట్టు సమాచారం.

 Ram Gopal Varma getting ready to file a defamation case on Natti kumar

2. తెలంగాణ హోకోర్టు జడ్డి ద్వారా పొందే ఇంజక్షన్ ఆర్డర్‌కు సంబంధించిన ఓ కాపీని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు పంపాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది.

3. ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులో నట్టి క్రాంతి, నట్టి కరుణపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

4. తనపై దుష్ప్రచారం చేస్తూ.. అసత్యపూరితమైన స్క్రీన్ షాట్స్‌తో తన పరువుకు భంగం కలిగించేలా చేస్తున్న నట్టి కుమార్‌పై ఐటీ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వర్మ ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం.

5. పలు మీడియా ఛానెల్స్‌లో తనపై తీవ్రమైన ఆరోపణలు, అసభ్యకరంగా నట్టి కుమార్ మాట్లాడటం వల్ల తన పరువుకు భంగం కలిగిందని భావిస్తున్న ఆర్జీవి భారీ మొత్తంలో పరువు నష్టం దావాను వేస్తున్నట్టు సమాచారం.

6. నట్టి కుమార్ వల్ల కలిగిన ఆర్థిక నష్టాలకు, మోసపూరిత చర్యల వల్ల కలిగిన నష్టానికి బదులుగా భారీ నష్టపరిహారం చెల్లించాలని కేసు వేయాలని కూడా ఆర్జీవి సిద్దమవుతున్నట్టు సమాచారం.

వర్మ జరుపుతున్న సమావేశాలు, సేకరిస్తున్న న్యాయ నిపుణుల సలహాల ఆధారంగా వర్మ భారీ ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X