twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రీడి హారర్ స్పెషాలిటీ ఏంటంటే ..రామ్ గోపాల్ వర్మ

    By Srikanya
    |

    మామూలుగా సినిమా థియేటర్‌లో ఓ హారర్‌ చిత్రాన్ని చూడటం వేరు. త్రీ డిలో చూడటం వేరు. ఎవరో రెండో వ్యక్తికి జరిగిన సంఘటనగా థియేటర్‌లో కనిపిస్తుంది. కానీ త్రీ-డీపై సంఘటనలో తనూ ఒకడుగా వీక్షకుడు భావిస్తాడు. అదీ తేడా. ఈ విధానం హారర్‌ చిత్రాలకు బాగా పనిచేస్తుంది అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సమర్ఫణలో వస్తున్న మరో హారర్ చిత్రం ఆవాహం ప్రమేషన్ లో భాగంగా మీడియాను కలిసి త్వరలో త్రీడి చిత్రం ప్లాన్ చేస్తున్నానని ఆయన అన్నారు.

    వీక్షకుల అనుభవాలు విన్న తర్వాత ఈ చిత్రాన్ని త్రీ-డి రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వర్మ తెలుపుతున్నాడు. అంతేగాక...వీక్షకుల్లో ఉండే ధైర్యాన్ని సడలించడాన్ని ఇష్టపడతానని, ఇలాంటి చిత్రాల ద్వారా దాన్ని అనుసరిస్తున్నానని అంటున్నారు. 'చిన్నప్పుడనే కాదు...భయపెట్టడమనే లక్షణం నాలో ఎప్పుడూ ఉంటుంది. చిన్నప్పుడు తలుపుల చాటున నిలబడి ఇతరుల్ని భయపెట్టేవాణ్ని. ఇప్పుడు సినిమాలు తీసి చేస్తున్నా...అంతే తేడా. అన్నారు.

    ఎంతవరకు వీక్షకులను ప్రభావితం చేయగలిగాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. తన జీవితంలో జరిగిందనో, ఎక్కడో విన్నట్టుందనో అనిపిస్తే..ఇలాంటి హారర్‌ చిత్రాలు క్లిక్‌ అవుతాయి. భయపెట్టే సన్నివేశాలు ఆ కథలో ఉండాలి. ఉదాహరణకు...భూత్‌ సినిమాలో కేవలం ఆరు సన్నివేశాలు మాత్రమే భయపెట్టేవి. భయపెట్టే సన్నివేశం మరోటి ఏమొస్తుందా అని వీక్షకుడు వేచిచూసాడు. ఇలాంటి లెక్కలపైనే హారర్‌ చిత్రాలుంటాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సౌండ్‌ ఎఫెక్ట్‌...అనేవి ఈ చిత్రానికి ప్రధానమైనవి. డ్రామా, కామెడీ తరహా కథల్లో నటుడి ప్రతిభ, రచయిత కౌశలం ప్రభావితం చేస్తాయి.

    కానీ హారర్‌ చిత్రంలో అలా కాదు. వీక్షకుల భావోద్వేగాలను తెలివిగా డీల్‌ చేయాలి. మనం అనుకున్న భావోద్వేగానికి వారిని తీసుకురావాలి. ఆడియన్స్‌ సైకాలజీ ఆధారంగా కెమరా కదలికలు ఉంటాయి. చూపించాల్సిన దాన్ని దాచిపెట్టడటంలోనే ఉంది అసలు విషయం. ఇక్కడే నాకు సినిమాల పట్ల ఆసక్తి కలిగింది. 'ఏవో అద్భుత శక్తులు దాగి ఉన్నాయి' అనే కాన్సెప్ట్‌ వీటికి ఆధారం అంటూ చెప్పుకొచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X