»   » మర్డర్ కేస్ మారియకు సినిమా ఆఫర్ చేసిన వర్మ

మర్డర్ కేస్ మారియకు సినిమా ఆఫర్ చేసిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మకు సంచలనాలు ఇష్టం...వివాదాలు మరీ ఇష్టం. అద్భుతమైన సినిమాలు తీయకపోయినా ఎప్పటికప్పుడు తన వివాదాలతో వార్తల్లో ఉంటున్నాడు. తాజాగా నీరజ్ గ్రోవర్ హత్యోదంతం ఆధారంగా తను నిర్మిస్తున్న 'ఇది ప్రేమ కథ కాదు' సినిమా ద్వారా నేషనల్ మీడియాలో వార్తల్లో కెక్కాడు. నీరజ్ హత్య కేసులో నేరస్తురాలిగా మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైన మారియా సుసైరాజ్ ను తన సినిమాలో ప్రధాన పాత్రధారిగా ఎంచుకుని వివాదానికి కారకుడయ్యాడు వర్మ.

అయితే, నటిగా ఆమెకు అవకాశాన్నివ్వడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ఎన్డీటీవీ లాంటి నేషనల్ మీడియా డిష్కషన్స్ కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా యువమోర్చా వర్మను హెచ్చరిస్తూ లేఖ రాయడంతో, ముంబయ్ లోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, మారియా లాంటి హంతకురాలిని ప్రోత్సహించకూడదని కొందరు విమర్శిస్తున్నారు. దీనిని వర్మ తీవ్రంగా ఖండిస్తున్నాడు. నేరం చేసి, శిక్ష అనుభవించి బయటకు వచ్చిన మనిషి బ్రతకకూడదా? ఆమె నటించకూడదా? అంటూ వర్మ వాదిస్తున్నాడు. చట్టపరంగా తనకున్న హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని అంటున్నాడు.

వర్మ సంగతి మనకు తెలుసు కదా... ఏదైనా చేయద్దన్న పనే ఆయన చేస్తాడు. పైగా, ఇది తన సినిమాకు ఉచిత ప్రచారాన్ని కూడా ఇస్తుంది. అందుకని దీనిని ఇంకా సాగదీసి, మరింత కాంట్రావర్శీ చేసినా చేస్తాడు. ఈ కథ చివరికి ఏ మలుపు తీసుకుంటుందో చూద్దాం!

English summary
Around 20 members of Bharatiya Janata Yuva Morcha (BJYM) were detained by police for carrying out protests near filmmaker Ram Gopal Varmas office in suburban Andheri for his statement on casting Maria Susairaj, convicted in the Neeraj Grover murder case, in his upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu