twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ పోటీకి లక్ష 80 వేల మంది ఎన్ రోల్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ 'ఆవహం' చిత్రాన్ని ఒంటరిగా చూసిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి భారీ ప్రతిస్పందన లభించిందని, దాదాపు ఒక లక్ష, 80 వేల మంది ఈ పోటీకి ఎన్‌ రోల్ చేసుకన్నారని నిర్మాత బుర్రా ప్రశాంత్ చెప్తున్నారు. అలాగే వీరిలో ఒకరిని సినిమా చూసేందుకు ఎంపిక చేయనున్నాం. ఒక్క వ్యక్తి చూసే ప్రదర్శన ముంబైలో జరుగుతుంది ఆయన అన్నారు. 'ఫూంక్-2' చిత్రం తెలుగులో 'ఆవహం' పేరుతో డబ్బింగై రిలీజవుతోంది.

    'ఆవహం' చిత్రాన్ని ఈనెల 16వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మిలింద్ గదగ్‌కర్ మాట్లాడుతూ, 'సుఖాంతమైన 'ఫూంక్' చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. ఆ చిత్రంలో చనిపోయిన మంత్రగత్తె దయ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం అన్నారు. అలాగే రామ్ గోపాల్‌వర్మ హిందీలో రూపొందించిన చిత్రాలకు రచయితగా పనిచేసిన తనకిది దర్శకుడిగా తొలి చిత్రమని మిలింద్ గదగ్‌కర్ తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X