»   » తప్పుల తడకేనంటూ ‘కిల్లింగ్ వీరప్పన్’పై మరో పిటీషన్!

తప్పుల తడకేనంటూ ‘కిల్లింగ్ వీరప్పన్’పై మరో పిటీషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీ అన్ని అడ్డంకులు తొలగించుకుని జనవరి 1, 2016న విడుదలయ్యేందుకు అంతా సిద్ధమైన నేపథ్యంలో మరో అడ్డంకి వచ్చి పడింది. ఈ సినిమా విడుదల నిలిపి వేయాలని మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. సినిమా మొత్తం తప్పుల తడకే, సినిమాలో అవాస్తవాలు చిత్రీకరించారు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు.

‘సినిమాలో మొత్తం తప్పుడు సమాచారంతో చిత్రీకరించారు. అవాస్తవాలను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైతే తమిలనాడులో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది' అని పిటీషనర్ పనీర్‌సెల్వి తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ జారీ చేసిన ‘యూ' సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలని కోరారు.

Ram Gopal Varma's Veerappan Film Taken to Court Over 'False Information'

కేవలం కర్నాటక పోలీసులు మాత్రమే 2004లో వీరప్పన్‌ను చంపినట్లు చూపించారు. ఇందులో తమిళనాడు పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం అసలు లేదనే విధంగా చూపించారు. ఇలా చేయడం వారిని అవమానించడమే అని పిటీషనర్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

శివరాజ్ కుమార్, పరుల్ యాదవ్, యగ్నా శెట్టి, సందీప్ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించిన ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ అవుతోంది. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్‌కు ఓ పోలీస్ అధికారి ఎలా చెక్ పెట్టాడు, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేసాడు, చివరకు అతన్ని ఎలా మట్టుపెట్టాడు అనేది అసలు స్టోరీ. ఈ చిత్రంలో ఒకప్పుడు వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ సీనియర్ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు. 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

English summary
A petition seeking to put on hold the release of Ram Gopal Varma's multilingual film Killing Veerappan has been filed in Madras High Court. The petitioner claims the film is full of "false information" on the forest brigand.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu