Don't Miss!
- News
ఏపీలో పాదయాత్రలపై డీజీపీ క్లారిటీ-అనుమతులు కావాలంటే..!
- Lifestyle
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Sudeep Vs Ajay Devan.. దక్షిణాది హీరోలంటే బాలీవుడ్ హీరోలకు జెలసీ.. హిందీ హీరోలపై వర్మ సెటైర్లు
హిందీ భాష జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ సుదీప కిచ్చ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం సృష్టించాయి. సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ఉత్తరాది జాతీయ భాష కాకపోతే.. ఎందుకు కన్నడ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు అంటూ హిందీ భాషలో ట్వీట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. అయితే అజయ్ దేవగన్ హిందీ ట్వీట్‌పై అంతే ఘాటుగా సుదీప్ స్పందిస్తూ.. అజయ్ దేవగన్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను నేను బాగానే అర్ధం చేసుకొన్నాను. అది చాలు మేమంత హిందీ భాషను గౌరవిస్తున్నామని చెప్పాడానికి. మిమ్మల్ని మానసికంగా దెబ్బ తీయడానికి కాదుగానీ.. అదే నేను మెసేజ్‌ను కన్నడలో టైప్ చూసి ఉంటే.. మీ పరిస్థితి ఎలా ఉండేది? అలాగని మీము కూడా భారతీయులం కాదా? అని సుదీప్ ప్రశ్నించాడు.

అయితే సుదీప్, అజయ్ దేవగన్ ట్వీట్ వార్‌పై స్పందిస్తూ.. మీరు ప్రశ్నించిన తీరు సరైనదే. అజయ్ దేవగన్ చేసిన హిందీ ట్వీట్‌కు సమాధానంగా నీవు కన్నడలో ట్వీట్ చేసి ఉంటే.. పరిస్థితి ఏమై ఉండేది? నార్త్ లేదు.. సౌత్ లేదు.. ఇండియా ఒక్కటే అనేది అందరి భావన అని ఆర్జీవి ట్వీట్ చేశాడు.
అయితే తన తప్పు తెలుసుకొన్న అజయ్ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేస్తూ.. కిచ్చ సుదీప్ నీవు నాకు మంచి స్నేహితుడివి. మన మధ్య అపార్థాలు తొలగించినందుకు థ్యాంక్స్ అంటూ అజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. నేను కూడా అదే భావిస్తున్నాను అజయ్.. నీ గురించి, నీ మనస్తత్వం గురించి చాలాకాలంగా నాకు తెలుసు. ప్రాంతీయం, సంస్కృతి అనే సరిహద్దులను దాటుకొని భాషలు వచ్చేశాయి. మనమంత సమైక్యంగా ఉండాలి కానీ సపరేట్ కావొద్దు అంటూ ఆర్జీవి హితవు పలికాడు.
రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేస్తూ.. సుదీప్ సార్.. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. కన్నడ డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్2 సినిమా విజయంతో దక్షిణాది హీరోలు అంటే.. ఉత్తరాది స్టార్లు అభద్రతాభావం.. జెలసీతో ఉన్నారు. కేజీఎఫ్2 చిత్రం మొదటి రోజే 50 కోట్లు సంపాదించింది. ఇక హిందీ సినిమాల ఓపెనింగ్స్ గురించి మనం చూడటం ఖాయం అని తనదైన శైలిలో సెటైర్ వేశాడు.