ఛలో విజయవాడకు ఇసుకేస్తే రాలనంత జనం.. జగన్ సర్కారు మాటేమిటో కానీ.. నాకు చలి జ్వరం అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్స్

ఏపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటు బాహుటా ఎగురవేశారు. తమ జీతాల్లో కోత విధించడంపై నిరసన గళం వినిపిస్తున్నారు. విజయవాడ రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వైఎస్ జగన్‌ ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా మారింది. ర్యాలీకి తరలి వచ్చిన ఉద్యోగుల సమూహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ఉద్యమంపై రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు. ఆయన చేసిన ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై

నూతన పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం అమలు చేసిన జీవోలపై ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమన్నారు. ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన చలో విజయవాడ ర్యాలీకి రికార్డు స్థాయిలో ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్ని అంక్షుల పెట్టినా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడం మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చనీయాంశమైంది. చలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర ఉద్యోగులు భారీగా తరలిరావడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన

ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన

చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వెళ్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం మరింత వివాదంగా మారింది. పలు జిల్లాలో ఉద్యోగులను అడ్డుకొనేందుకు భారీగా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టడంపై రాజకీయ నేతలు ఖండించారు. ఉద్యోగులతో ప్రవర్తించే విధానం సరిగాల లేదని.. ఏపీలో జీతాలు సవ్యంగా ఇవ్వలేని దుస్తితి నెలకొన్నది. ప్రభుత్వ ఖజానాను బలోపేతం చేయడానికి ఆదాయ మార్గాలను అన్వేషించాలి కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం సరికాదు అంటూ పలువురు రాజకీయ నేతలు భగ్గుమన్నారు.

ప్రపంచంలో ఇదే మొదటిసారి అనుకొంటా

గురువారం ఏపీలోని విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ ర్యాలీకి భారీగా ఉద్యోగులు తరలి రావడంపై రాంగోపాల్ వర్మ ఘాటుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు సంధించారు. తమ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి రావడం చూసి షాక్ తిన్నాను. ప్రపంచంలో ఇంత మంది ఉద్యోగులు నిరసన తెలియజేయడం ఇదే మొదటి సారి అనే అనుమానం నాకు కలుగుతున్నది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాకు చలి జ్వరం వచ్చిందంటూ..

చలో విజయవాడ ర్యాలీ కోసం వచ్చిన ఉద్యోగులతో విజయవాడ రోడ్లనీ కిటకిటలాడిపోయాయి. సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతుండటం చూసి సామాన్య ప్రజలు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆ ఫోటోలను చూసిన రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఏపీ సర్కార్ సంగతేమో గానీ.. విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది అని కామెంట్ చేశారు. ప్రభుత్వ ఆంక్షల మధ్య కూడా ఇంత మంది నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అందర్నీ షాక్ గురిచేస్తున్నది.

Recommended Video

RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
శుక్రవారం స్టీరింగ్ కమిటీ మీటింగ్

శుక్రవారం స్టీరింగ్ కమిటీ మీటింగ్

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై, చలో విజయవాడ సక్సెస్‌పై శుక్రవారం స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం. ఈ సమావేశంలో తదుపరి కార్యచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వంతో జరిపే చర్చలకు వెళ్లాలా? లేదా అనేది ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటాం. ఉద్యోగుల డిమాండ్లనీ నెరవేర్చే వరకు రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం. అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరుతుగా విడుదల చేయాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X