»   » పవన్ మూడు పెళ్లిళ్లు.. వాళ్ల ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడలేదే.. వర్మ కౌంటర్

పవన్ మూడు పెళ్లిళ్లు.. వాళ్ల ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడలేదే.. వర్మ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకొన్నది. శుక్రవారం మీడియా సమావేశంలో తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత విమర్శలకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ధీటైన సమాధానం ఇచ్చారు.

'నా జీవితం, నా లైఫ్‌స్టైల్, నా ఆలోచనా విధానం గురించి దాక్కోకుండా, దాచుకోకుండా నా పుస్తకం నా ఇష్టంలో మొత్తం విప్పి విప్పి రాశాను. ఒక అభిమానిగా పీకే (పవన్ కల్యాణ్) మీద ఒక అంచనాతో మాట్లాడాను. కానీ తను చేసుకొన్న మూడు పెళ్లిళ్ల గురించి, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పుడూ మాట్లాడలేదు' అని ట్వీటర్‌లో పేర్కొన్నాడు.

అంతేకాకుండా వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను తిట్టారు. మరి వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడవచ్చా? ఇదేం వికాసం అంటూ వర్మ తీవ్రస్థాయిలో స్పందించారు.

Ram Gopal Varma serious comments on Pawan Kalyan

'నేను తన మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడాను గానీ విమర్శలు చేయడానికి కాదని పీకే తెలుసుకోకపోవడం నా దురదృష్టకరం' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

'పవన్ కల్యాణ్, ఆయన భార్య, పిల్లలు, కుటుంబం, జనసేన పార్టీ, పీకే అభిమానులు బాగుండాలని కోరుకొంటున్నాను. ఆల్ ది బెస్ట్' అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, వర్మల మధ్య మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా తీవ్రస్థాయికి చేరుతుందా అనేది వేచిచూడాల్సిందే.

English summary
Ram gopal varma reached on Pawan kalyan satires
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu