»   » లైవ్‌ షోలో గొడవ పడ్డ రామ్ గోపాల్ వర్మ, శివాజీ (వీడియో)

లైవ్‌ షోలో గొడవ పడ్డ రామ్ గోపాల్ వర్మ, శివాజీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ‘వంగవీటి' చిత్రం ఏపీలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజధాని విజయవాడలో ఇపుడు ఇదో హాట్ టాపిక్. ఈ సినిమాలో పలువురు రాజకీయ నేతలను కూడా చూపించబోతున్నట్లు వర్మ చెప్పడంతో పొలిటికల్ సర్కిల్ లో కూడా ఈ సినిమా చర్చనీయాంశం అయింది.

Ram Gopal Varma and Sivaji Arguments on Vangaveeti movie

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ టీవీ 9కు నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరోగా ప్లాప్ అయి రాజకీయాల బాట పట్టిన హీరో శివాజీ ఫోన్ చేయడం.... అతనికి, వర్మకు మధ్య వాగ్వివాదం ఆసక్తికరంగా సాగింది. అందుకు సంబంధించి వీడియోపై మీరూ ఓ లక్కేయండి.

''మీరు ఇప్పుడు వంగవీటి అంటూ సినిమా తీయడం వలన.. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సమసిపోయి.. జనాలు మర్చిపోయిన.. ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ తలెత్తుతాయి. కుల రాజకీయాలను రెచ్చగొట్టడం ఎందుకు సార్??'' అంటూ ప్రశ్నించాడు శివాజి. దీనికి సమాధానం చెప్పిన వర్మ.. ''నేనేమన్నా 5వ క్లాస్ పిల్లోడినా.. నాకు మీరు క్లాస్ పీకుతున్నారు. నేను రంగా అండ్ నెహ్రూలలో ఎవరిని తప్పుగా చూపించినా.. వారి అనుచరుల నా మీద ఎటాక్ చేస్తారు కాని.. కమ్మ అండ్ కాపు కులాలు ఎందుకు కొట్టుకుంటాయి చెప్పండి??'' అంటూ ఎదురు ప్రశ్నించాడు వర్మ.

'నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి' అని సీరియస్‌గా చెప్పారు. ఇందుకు శివాజీ స్పందిస్తూ, 'సామాజిక బాధ్యత మీకు లేదా?' అని ప్రశ్నించాడు. 'తనకు కూడా సామాజిక బాధ్యత ఉందని, తానేం చేస్తున్నానో తనకు తెలుస'ని వర్మ బదులిచ్చారు. ఇంతలో శివాజీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, 'చూడు శివాజీ.. తాను క్లాసు పీకొద్దు... తానేం చేస్తున్నానో, తానేం చేయాలో తనకు తెలుస'ని వర్మ ఘాటుగా సమాధానం చెప్పారు. దీనికి ఆగ్రహించిన శివాజీ 'మీరు చెబితే మేమంతా వినాలి... మేము చెబితే మాత్రం మీరు వినరా?' అని ప్రశ్నించాడు.

Read more about: ram gopal varma, vangaveeti, sivaji
English summary
Vangaveeti can trigger violence in AP, Hero Sivaji advises Ram Gopal Varma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu