twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    AP Govtకి వర్మ పది ప్రశ్నలు.. పెద్దదిక్కన్న శిష్యుడికి క్లాస్ పీకి, వాడి మాట ఎవ్వడూ వినడంటూ షాకింగ్ గా!

    |

    ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తుంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వర్మ వరుస పోస్టులు, వీడియోలు రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీ పెద్ద అంటూ సాగుతున్న వ్యవహారం మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
    రచ్చ చేస్తున్న వర్మ

    రచ్చ చేస్తున్న వర్మ

    ఆంధ్రప్రదేశ్ లోని మూవీ థియేటర్ టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. అయితే థియేటర్ లో సినిమా టికెట్ ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని సినీ ప్రముఖులు మండి పడుతున్నారు. తాజాగా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వర్మ రచ్చ చేస్తున్నారు.

    ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తారు?

    ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తారు?

    తాజాగా రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరలపై స్పందిస్తున్న మంత్రులకు 10 ప్రశ్నలు సంధిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో పది ప్రశ్నలు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. వినియోగదారుడికి, తయారుదారుడు మధ్యలో ఉన్న ప్రైవేట్ ట్రాన్సాక్షన్ లో ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే, అలాంటి పరిస్థితి ప్రస్తుతం సినిమాలో ఎప్పుడు ఏర్పడింది? అని ఆయన ప్రశ్నించారు. ఒక సినిమా లేదా పంట సహా ఏదైనా వస్తువు తయారు చేస్తున్నప్పుడు దానికి సరైన ధర తిరిగి రానప్పుడు.. తయారుదారుడుకి మోటివేషన్ పోతుంది. అప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయి తక్కువ క్వాలిటీ లో ప్రజలకు ప్రోడక్ట్ ఇస్తారు.. మీరు దానికి ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

    అన్నిటికీ సబ్సిడీ

    అన్నిటికీ సబ్సిడీ

    సినిమా అనేది నిత్యావసర వస్తువు .. ప్రజలకు అవసరం అవుతుందని అనుకున్నప్పుడు.. దానిని ప్రభుత్వం అన్నిటికీ సబ్సిడీ ఇచ్చినట్లు .. ప్రొడ్యూసర్ కి సబ్సిడీ చేయమంటున్నారు.. ఇది నా ఫీలింగ్ కాదు మీ ఫీలింగ్ కదం అలాంటప్పుడు రేషన్ షాప్స్ లాగా థియేట్ర్స్ ఎప్పుడు పెడుతున్నారు అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఏమి కోరుకుంటున్నారో.. అదే ధరకు ప్రభుత్వం కొనుక్కుని అదే ధరకు లేదా ఇంకా తక్కువ ధరకు ప్రజలకు ఇస్తే.. మీ ఓట్లు మీకు వస్తాయి.. ఇదెలా ఉంది అని కూడా ఆయన పేర్కొన్నారు.

     ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    ఇక మీలో కొందరు సినిమా వ్యయం గురించి మాట్లాడుతున్నారు.. సినిమా వ్యయం రెమ్యునరేషన్ డిఫరెంట్ కాదు.. సినిమాకు పవన్, మహేష్ , నన్ను చూసి వస్తారు, ప్రొడ్యూసర్ వాళ్ళ ట్రాక్ రికార్డు చూసి రెమ్యూనరేషన్ ఇస్తారు.. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.. అది ఇచ్చి.. పుచ్చుకునేవారు మధ్య ఉండే వ్యాపారం అని ఆయన అన్నారు. ప్రోమో బాగుంటుంది... సినిమా బాగుంటుందా అని అంటున్నారు.. వస్తువు రూపంలో కొంటే నచ్చక పోతే తిరిగి ఇచ్చేస్తారు.. అప్పుడు వస్తువు తిరిగి తయారుదారుకు వెళ్ళిపోతుంది.. టమాటా సగం తిన్నాక తిరిగి బాగాలేదు అన్నా.. ఫైవ్ స్టార్ హోటల్ లో బాగా తిని.. బాగాలేదు.. తిరిగి ఇచ్చేస్తాను అంటే ఎలా ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇలా తన అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పవచ్చు అని రామ్ గోపాల్ వర్మ కోరారు.

     వాడి మాట ఎవ్వడూ వినడు

    వాడి మాట ఎవ్వడూ వినడు

    మరోపక్క ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి 'మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ. ఇండస్ట్రీ పెద్ద ఆర్జీవీ'' అని వర్మను ట్యాగ్ చేస్తూ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ''అజయ్ గారు, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం..ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి..దాని మూలాన వారికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు కానీ , ఎవడికో పెద్ద దిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    English summary
    Ram Gopal Varma Ten Questions to AP Government over ticket pricing issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X