»   » నిత్యం ఆమె నామస్మరణంతోనే తరిస్తున్న రామ్ గోపాల్ వర్మ...!?

నిత్యం ఆమె నామస్మరణంతోనే తరిస్తున్న రామ్ గోపాల్ వర్మ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ అంటే ఎలాగుండాలనే దానికి గతంలో అయితే కొలతలూ గట్రా చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సరాసరి ఇలియానా ఫోటో చేతికిచ్చేసి ఇలా తయారై రమ్మంటున్నారు. ఎంతటి రుషి పుంగవుడుకైనా మతి చలించేలా చేసే అందం ఇలియానా సొంతమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలియానా అందానికి దాసోహమన్న చాలా మందిలో తాను కూడా ఒకడినని అంటున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇలియానా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నాళ్లకు ఆమె అందాన్ని సరిగ్గా గుర్తించిన రామ్ గోపాల్ వర్మ నిత్యం ఇలియానా నామ స్మరణంతో తరిస్తున్నాడు.

కొన్నేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ సాధించింది ఏదయినా ఉంటే అది ఇలియానాని హీరోయిన్ గా కనుగొనడమేనని అంటున్నాడు. 'నేను నా రాక్షసి" రషెస్ చూసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నిత్యం ఏదో రకంగా ఇలియానాని గుర్తు చేసుకోకుండా ఉండట్లేదు. వైజయంతి మాల, సావిత్రి తర్వాత తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం ఇలియానా అంటూ పొగిడేస్తున్నాడు. మరి ఇలియానాని ఇంతగా పొగిడేస్తూ ఆకాశానికెత్తేసినా కానీ ఇలియానా మాత్రం సైలెంట్ గా సినిమా చూస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu