Don't Miss!
- News
జమ్మూకాశ్మీర్లో భారీ హిమపాతం: ఇద్దరు విదేశీయులు మృతి
- Sports
IND vs NZ: శతక్కొట్టిన శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్ ముందు టఫ్ టార్గెట్!
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలో కంటతడి పెట్టించే సన్నివేశాలు.. లీక్ చేసిన ఫైట్ మాస్టర్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వీర సింహారెడ్డి సినిమా అలాగే నందమూరి బాలకృష్ణ వాల్తేరు వీరయ్య కూడా 2023 సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ చాలా వరకు రెండు సినిమాలకు కలిసి పని చేయడం విశేషం. ముఖ్యంగా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ సినిమాకు కొన్ని యాక్షన్స్ సన్నివేశాలకు వర్క్ చేశారు. అయితే సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ గురించి వారు లీక్ చేసిన పాయింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి ఫైట్
మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇదివరకే కొన్నిసార్లు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. అయితే ఈ క్రమంలో రెండుసార్లు మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధించగా.. మరో రెండు సార్లు బాలకృష్ణ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నాడు. ఇక మరో రెండు మూడు సార్లు ఇద్దరు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

డేట్స్ కూడా ఫిక్స్
ఇక 2023 జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి విడుదలవుతుండగా.. జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కాబోతోంది. ఇక ఈ రెండు సినిమాలలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడా సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం విశేషం.

రెండు సినిమాలకు వర్క్ చేసిన
ఈ సినిమాలకు కామన్ గా వర్క్ చేసిన వారిలో శృతిహాసన్ ఒకరు. ఇద్దరు అగ్ర హీరోలకు ఆమె మెయిన్ హీరోయిన్ గా నటించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఆర్ట్ డైరెక్టర్ అలాగే సాంగ్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా రెండు సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. అలాగే ఫైట్ మాస్టర్స్ రామ లక్ష్మణులు కూడా ఈ సినిమాకు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ను అందించారు.

కంటతడి పెట్టించే సీన్
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ సినిమాలోని కొన్ని ఎమోషనల్ పాయింట్స్ గురించి కూడా తెలియజేశారు. ఫైట్స్ లో ఉండే కొన్ని యాక్షన్స్ సన్నీవేషాలు చాలా అద్భుతంగా ఉంటాయని తెలియజేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆడియన్స్ ను కంటతడి పెట్టిస్తుంది అని అన్నారు.

చిరు, రవితేజ మధ్యలో..
అలాగే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య లో కూడా ఒక ఫైట్ సీన్లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అని రామ్ లక్ష్మణ్ చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి రవితేజ ఇద్దరు మధ్యలో కూడా కొనసాగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తాయి అని వివరణ ఇచ్చారు. మొత్తానికి రెండు సినిమాలలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అని ఆడియన్స్ ఈ పండగ సీజన్లో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారు అని అన్నారు.