»   » కృష్ణవంశీ లేటెస్ట్ 'కందిరీగ' హీరో రామ్

కృష్ణవంశీ లేటెస్ట్ 'కందిరీగ' హీరో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఓ చిత్రం నిర్మాణం కానుందని సమాచారం. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ పూర్తయ్యాయని, అయితే చిత్రం ప్రారంభం దాకా సీక్రెసీ మెయింటైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్‌ లేదా జులై నెలలో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఇక ఇంతకు ముందు కృష్ణవంశీ..రవితేజ హీరోగా కందిరీగ చిత్రం ప్లాన్ చేసారు. అయితే బెల్లంకొండ సురేష్ వచ్చిన పొరపొచ్చాలుతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు అదే కథని కొద్దిగా మార్చి రామ్ తో చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రామ్‌ హీరోగా ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తోన్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కాకుండా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ అధినేత రవికిషోర్‌ నిర్మించే చిత్రం ఇటీవలే ముహూర్తం జరుపుకుంది.ఆ చిత్రానికి ఊసరవిల్లి అనే టైటిల్ పెట్టారు. కృష్ణవంశీ..మహాత్మా చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu