»   » రూటు మార్చిన రామ్ : 'నేను..శైలజ' థియోటర్ ట్రైలర్ (వీడియో)

రూటు మార్చిన రామ్ : 'నేను..శైలజ' థియోటర్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ నటించే చిత్రాలంటే చాలా రొటీన్ కాన్సెప్టు లతో కమర్షియల్ టచ్ ఇస్తూ సాగుతాయి. అయితే రామ్ తన రూటు మార్చుకున్నట్లున్నాడు. కమర్షియల్ చిత్రాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు.. 'నేను..శైలజ' .

ఈ చిత్రానికి గతంలో సెకండ్ హ్యాండ్ చిత్రానికి డైరక్షన్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో పంక్షన్ నిన్న సాయింత్రం జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ.....షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. కిషోర్ కథ చెప్పగానే రామ్‌కు కొత్త తరహా సినిమా అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాం. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ కాబట్టి నేను...శైలజ టైటిల్ అయితే బాగుంటుందని ఈ పేరును ఖరారు చేశాం. జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర కథ వైజాగ్‌లో మొదలై అక్కడే ముగుస్తుంది. పాటల్లోనూ కథను చెప్పే ప్రయత్నం చేశాం అన్నారు.


Ram's Nenu Sailaja Movie Theatrical Trailer

హీరో రామ్ మాట్లాడుతూ ....ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించాను. తొలుత ఈ చిత్రానికి హరికథ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ సినిమా చూసిన తరువాత దీనికి నేను...శైలజ కరెక్ట్ అని భావించాం. 55 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. నైట్ క్లబ్‌లో పనిచేసే డీజేగా నటించాను. సాఫ్ట్‌గా కనిపించే పాత్ర అయినా మాస్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సినిమా వుంటుంది అన్నారు.దర్శకుడు మాట్లాడుతూ ....నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను తీసుకుని కథగా మలిచాను. సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా రియలిస్టిక్‌గా వుంటుంది. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి టీమ్ కుదరడంతో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది అన్నారు.


ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్:ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
English summary
Nenu Sailaja Movie Theatrical Trailer released. Movie featuring Ram and Keerthi Suresh. Music composed by Devi Sri Prasad and directed by Kishore Tirumala. Produced by Sravanthi Ravi Kishore under the banner Sri Sravanthi Movies.
Please Wait while comments are loading...